నిత్యం హైదరాబాద్ నగరంలో ఏదో ఒకచోట రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. రోడ్డు భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కఠిన నిబంధనలను తీసుకొచ్చిన వాహనదారులు మాత్రం వారి పని వారు చేసుకుంటున్నారు. అంతేకాదు.. వారితో పాటుగా ఎదుటివారికి కూడా హానిని కలిగిస్తున్నారు. అలాంటిదే తాజాగా.. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో మరో కారు ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం రాత్రి బంజారాహిల్స్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన బీఎండబ్ల్యూ కారు ఒకటి.. స్కూటర్‌పై వెళ్తున్న వ్యక్తిని బలంగా ఢీకొట్టింది. దీనికి సంబంధించిన సీసీటీవీ వీడియోను ట్రాఫిక్ పోలీసులు శుక్రవారం రిలీజ్ చేశారు. ఫుల్లుగా తాగిన ఓ మహిళా ఆ కారును నడుపుతున్నట్లు వీడియోలో రుజువైంది.
పూర్తిగా చదవండి..రాంగ్రూట్లో స్కూటీని ఢీకొట్టిన బీఎండబ్ల్యూ కారు, వీడియో వైరల్
రాంగ్ రూట్లో అతివేగంగా వచ్చిన ఓ కారు.. అదే రోడ్డు మార్గాన బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనదారుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో గురువారం రాత్రి చోటుచేసుకుంది. దానికి సంబంధించిన సీసీటీవీ వీడియోను పోలీసులు రిలీజ్ చేశారు. దీనికి సంబంధించిన ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Translate this News: