Worlds Ugliest Fish: అందవిహీనమైన జలపుష్పం..బ్లాబ్ ఫిష్..దీన్ని చూస్తే పక్కా భయపడతారు ప్రపంచంలోనే అత్యంత వికారమైన చేప.. బ్లాబ్ ఫిష్. ఇది చూడడానికి చాలా అసహ్యంగా ఉంటుంది. ముఖ్యమైన విషయం ఏంటంటే దీని ఆకారం ఏమోజీలను పోలి ఉంటుంది. సముద్రంలోని సుమారు 1200 మీటర్ల అడుగుల లోతుల్లో ఈ చేపలు సంచరిస్తుంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. By Vijaya Nimma 09 Dec 2023 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Worlds Ugliest Fish: కుక్కలు, పిల్లులు అంటే ఎవరికి ఇష్టముండదు చెప్పండి. బుజ్జి బుజ్జిగా ఎంతో ముద్దొచ్చే అందమైన పెట్స్ గురించి మనందరికీ తెలసిందే. అయితే ఇటీవల ముద్దొచ్చే పెట్స్ గురించి కాకుండా అసహస్యకరమైన పెట్స్ గురించి కూడా పేర్కొంటున్నారు. కుక్కలో, పిల్లులో అయితే సరే కానీ వీటి సరసన ఇప్పుడు జల పుష్పాలు కూడా వచ్చి చేరాయి. అగ్లీ యానిమల్ ప్రిజర్వేషన్ సోసైటీ అనే సంస్థ అగ్లీగా ఉన్న పెట్స్‌కి అవార్డులు ఇస్తుంది. తాజాగా ఓ వికారమైన చేపకూడా ఉందనీ, దీన్ని చూస్తే భయంకరంగా ఉంటుందని ఈ సంస్థ ప్రకటించింది. దానికి అసహక్యకరమైన చేప అనే బిరుదును కూడా ఇచ్చేసింది. మరి ఆ చేప కథా ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. చూసేందుకు వికారం.. ఈ అందవిహీనమైన చేప పేరు సైక్రోల్యూట్స్ మైక్రోపోరోస్. అంటే అర్థం కాలేదు కదా.. అది దాని శాస్త్రీయ నామం. మనం మామూలుగా పిలుచుకునే పేరు బ్లాబ్ ఫిష్. ఇది సైక్రోల్యూట్స్ మైక్రోపోరోస్ కుటుంబానికి చెందిన చేప. బ్లాబ్ ఫిష్ అనగానే ఈ పేరు ఎక్కడో విన్నట్లు అనిపిస్తుంది కదూ. 2003లోనే ఇంటర్నెట్‌లో ఈ చేప పేరు తెగ హల్‌చల్ సృష్టించింది. అసలు ఇలాంటి చేప అనేదే లేదని అప్పట్లో చాలామంది అన్నారు కూడా. మరో ముఖ్యమైన విషయం ఏంటి అంటే దీని ఆకారం ఏమోజీలో కూడా ఉంటుంది. అయితే.. ఈ చేపలేదు అని అనుకోవడానికి లేదు.1983లో న్యూజిలాండ్ సముద్ర తీరంలో జరిపిన ఓ పరిశోధన నౌక ఈ చేప నిజంగానే ఉంది అనే విషయాన్ని కనుక్కుంది. ఇది కూడా చదవండి: సపోటా పండును డైట్‌లో చేర్చుకోండి.. ఏం జరుగుతుందో తెలుసుకోండి! వాటి గురించి చేసిన పరిశోధనల్లో తెలిసిన విషయాలేంటి అంటే.. సముద్రంలో సుమారు 600 నుంచి 1200 మీటర్ల అడుగుల లోతుల్లో ఈ చేపలు సంచరిస్తుంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సముద్రంలోతులో ఉండడం వల్ల అక్కడ పీడనం ఎక్కువగా ఉంటుంది. దానివల్ల వీటి ఎముకలు, కండరాలతో కూడిన మెత్తని శరీరంతో చూసేందుకు వికారంగా ఉంటాయని, ఆ సయమంలో అది చూస్తే జెల్లీ ఫిష్ మాదిరిగా కనిపిస్తుందని అంటున్నారు. అప్పుడు అందంగానే కనిపించినప్పటికీ సముద్రం నుంచి దీన్ని బయటకు తీస్తే పైన ఒత్తడి తక్కువుగా ఉండటం వల్ల దీని శరీరం విస్తరించినట్లుగా అయ్యి రిలాక్స్‌డ్ మోడ్‌లో ఉండి ముక్కు బయటకు వచ్చి ఉంటుంది. అది చూడడానికి చాలా అసహ్యంగా ఉంటుంది. దాంతో సాధారణంగా చూసే వాళ్లకు ఇవి చాలా అసహ్యంగా కనిపిస్తాయని అంటున్నారు పరిశోధకులు. అంతేకాదు దాని వింత ఆకారం భయం కొలిపే విధంగా కూడా ఉంటుంది. అందుకే దీనికి అత్యంత అందవిహీనమైన చేపగా అగ్లీ యానిమల్ ప్రిజర్వేషన్ సొసైటీ దీన్ని ప్రపచంలోనే అత్యంత వికారమైన బ్లాబ్ ఫిష్‌కు బిరుదును ఇచ్చేసారు. ఏది ఏమైనప్పటికీ ఎన్నో అందమైన చేపలు చూసిన మనకి ఇప్పుడు అందవిహీనమైన చేపగా దీన్ని ప్రకటించడం కొంత ఆశ్చర్యం కలిగించే విషయమే కదా. #worlds-ugliest-fish మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి