America: సాయం కోసం ఫోన్ చేస్తే ఆమెనే కాల్చి చంపిన పోలీసులు! అమెరికాలో 911 కు కాల్ చేసి తనకు రక్షణ కావాలని కోరిన మహిళనే పోలీసులు కాల్చి చంపారు. దీంతో మృతురాలి తల్లిదండ్రులు న్యాయపోరాటానికి దిగారు. By Bhavana 23 Dec 2023 in క్రైం ఇంటర్నేషనల్ New Update షేర్ చేయండి అమెరికాలోని లాన్ కాస్టర్ లో ఓ దారుణ ఘటన చోటు చేసుకుంది. సాయం కోసం పోలీసులకు ఫోన్ చేసిన మహిళనే పోలీసులు కాల్చి చంపారు. ఈ దారుణ ఘటనలో చనిపోయిన మహిళ ఓ నల్లజాతీయురాలు కావడంతో లాన్‌కాస్టర్ లో కొంత ఉద్రిక్తత నెలకొంది. ఈ కేసులో మరో ట్విస్టు ఏంటంటే..ఇప్పుడు ఈ మహిళను కాల్చిన పోలీసు ఆఫీసర్ కి గతంలో కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే ఓ వ్యక్తిని కాల్చి చంపిన రికార్డు ఉంది. ఈ ఘటన డిసెంబర్ 4 వ తేదీన జరగగా బాధితురాలి తల్లిదండ్రులు న్యాయపోరాటానికి దిగారు. అసలేం జరిగిందంటే..లాస్ ఏంజెల్స్ లాన్ కాస్టర్ లో నియాని ఫిన్లేసన్ (27) చాలా కాలం నుంచి తన ఇద్దరు కూతుళ్లతో ఉంటుంది. ఈ క్రమంలోనే ఆమె మాజీ ప్రియుడు ఆమె ఇంటికి వచ్చి గొడవ పడ్డాడు. దీంతో ఆమె సాయం కోసం పోలీసులకు 911కి కాల్ చేసింది. గృహ హింస పై రిపోర్ట్ చేసి తనకు రక్షణగా పోలీసులను పంపాలని కోరింది. అయితే పోలీసులు అక్కడికి వెళ్లేసరికి నియాని చేతిలో 8 అంగుళాల కత్తి ఉందని..నియాని తన మాజీ ప్రియుడ్ని చంపడానికి ప్రయత్నించిందని పోలీసులు వివరించారు. ఈ క్రమంలో ఆమెను చాలాసార్లు కత్తి కింద పడేయాలని అడిగినప్పటికీ కూడా ఆమె మాట వినకపోవడం వల్లే ఆమె పై కాల్పులు జరిపినట్లు పోలీసుల వివరించారు. బుల్లెట్ గాయాలతో నియాని కిందపడిపోయింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా వైద్యులు ఆమె చనిపోయినట్లు తెలిపారని పోలీసు అధికారులు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఈ కేసు కోసం నియాని ఇంటికి వెళ్లిన పోలీసుల్లో టీవై షెట్లన్ అనే అధికారి కూడా ఉన్నారు. ఆయన మూడు సంవత్సరాల క్రితం ఇలాంటి పరిస్థితుల్లోనే ఓ వ్యక్తిని కాల్చి చంపారు. దీంతో తాజాగా జరిగిన ఘటన పై అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఈ క్రమంలో నియాని 9 ఏళ్ల కూతురు పోలీసులు చెబుతున్న దానిలో నిజాలు లేవని తెలిపింది. కావాలనే పోలీసులు తన తల్లి పై కాల్పులు జరిపారని, ఆమె కిందపడిపోయిన తరువాత నేను అమ్మ కోసం ఏడుస్తుంటే తనని ఓదార్చారని వివరించింది. దీంతో నియాని తల్లిదండ్రులు తమ కూతురు మరణం వెనుకు నిజాలు వెలికితీయాలంటూ న్యాయపోరాటానికి దిగారు. తమ కూతురును చంపిన పోలీసు అధికారిని చట్ట ప్రకారం శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. Also read: ఫోర్బ్స్ మ్యాగజైన్ కవర్ పేజీపై ఉపాసన, రామ్ చరణ్..టాలీవుడ్ ఫస్ట్ కపుల్ గా ఘనత! #police #america #shoot #911 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి