/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/kcr-3-1-jpg.webp)
KCR: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటి పక్కన క్షుద్ర పూజల ఆనవాళ్లు కలకలం సృష్టిస్తున్నాయి. నందినగర్ లో కేసీఆర్ ఇంటి పక్కన ఉన్న ఖాళీ స్థలంలో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేసినట్లు తెలుస్తోంది. ఎర్రని బట్టలు, బొమ్మ, పసుపు కుంకుమ, వెంట్రుకలు, నిమ్మకాయలతో భయానకమైన పరిస్థితి కనిపిస్తోంది. నిన్న అర్ధరాత్రి ప్రాంతంలో ఈ క్షుద్ర పూజలు జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు.