/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-2024-02-14T193927.619-jpg.webp)
Grey Hair Tips: గ్రే హెయిర్ తగ్గించడానికి సహజమైన పద్ధతిని ఎంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు. రసాయనాలతో కూడిన రంగులు వాడటం వల్ల జుట్టు ఆరోగ్యం దెబ్బతింటుందని, అలాగే చర్మం దెబ్బతింటుందని చెబుతున్నారు. జీవన శైలి విధానాలు, ఆహారపు అలవాట్లు కూడా చిన్న వయసులోనే తెల్ల జుట్టు రావడానికి కారణమవుతున్నాయి. అయితే జుట్టు రంగు మార్చడానికి కెమికల్ కలర్స్ కాకుండా.. సహజంగా ఇంట్లో దొరికే నల్ల జిలకర ఉపయోగించడం జుట్టు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. బ్లాక్ సీడ్ ఆయిల్‌ను ఉపయోగించడం వల్ల చర్మానికి కూడా మేలు చేస్తుంది.
నల్ల జీలకర్ర తో డ్యాన్డ్రఫ్, హెయిర్ ఫాల్ సమస్యలు కూడా తగ్గుతాయి. అలాగే నల్ల జీలకర్ర జుట్టును కండీషనింగ్ కూడా చేస్తుంది. జుట్టు కుదుళ్లను బలపరిచి.. రాలిపోకుండా దృడంగా ఉంచుతుంది. ఇప్పుడు నల్ల జీలకర్రతో తయారు చేసే హెయిర్ ఫ్యాక్స్ ఎలా చేసుకోవాలో చూడండి.
Also Read: Kitchen Tips: ఇంట్లో పప్పుకు పురుగు పడుతుందా.. అయితే ఈ టిప్స్ మీ కోసమే
నల్ల జీలకర్ర ఫ్యాక్స్
- 2 టేబుల్ స్పూన్ల ఆవనూనె 2, టేబుల్ స్పూన్ల నల్ల జీలకర్ర గింజలు, 1 టేబుల్ స్పూన్ అలోవెరా జెల్, 1 ఉల్లిపాయ. ముందుగా నల్లజీలకర్ర, ఆముదం కలిపి వేడి చేయాలి. వేడి అయ్యాక తీసి రెండు గంటలు చల్లారనివ్వాలి. బాగా చల్లారిన తర్వాత అందులో ఉల్లిపాయ, అలోవెరా జెల్ వేసి బాగా గ్రైండ్ చేయాలి. దీన్ని తలకు బాగా పట్టించి అరగంట తర్వాత కడిగేయవచ్చు.
- 1 గ్లాసు నల్ల జీలకర్ర, 1/2 జామకాయ పొడి, 1 టేబుల్ స్పూన్ కాఫీ పొడి, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం తీసుకుని అందులో నీళ్లు పోసి మరిగించాలి. నీళ్లు సగం అయిన తర్వాత దాన్ని జుట్టుకు రాసుకుని అరగంట తర్వాత కడిగేయాలి. క్రమం తప్పకుండా ఇలా చేస్తే జుట్టుకు మంచి నలుపు రంగు వస్తుంది.
Also Read: Beauty Tips: చర్మం పై ముడతలు వస్తున్నాయా..? అయితే మీరు ఇవి తినడం లేదు