BJYM state president Mitta Vamsi: కడపలో బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు మిట్టా వంశీ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ముందు స్మగ్లర్లు అడవిలో ఉండేవారని.. అయితే, జగన్ ప్రభుత్వంలో స్మగ్లర్లు అసెంబ్లీ ఉన్నారని విమర్శలు గుప్పించారు. అందుకే ఎర్రచందనం పక్క దేశాలకు తరలి వెళ్ళిపోతుందని కామెంట్స్ చేశారు.
Also Read: పవన్ కళ్యాణ్ కు రాజకీయ భవిష్యత్ లేదు.. షర్మిల ఎక్కడ పోటీ చేసినా అంతే.. యడ్ల తాతాజీ కీలక వ్యాఖ్యలు
రానున్న ఎన్నికల్లో జగన్ ను ఇంటికి పంపే రోజులు దగ్గర పడ్డాయని వ్యాఖ్యానించారు. మళ్ళీ స్మగ్లర్లను జైలుకు పంపిస్తామన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా సిద్ధం పోస్టర్లని.. గుడి, బడి.. ఏది వదలకుండా సిద్ధం బ్యానర్లు ఏర్పాటు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అవాస్ యోజన పథకం కింద కేంద్రం ఎన్ని ఇల్లు కట్టిందో చర్చకు సిద్ధమా? జగన్ సిద్ధంగా ఉన్నారా? మంగళగిరి లో ఏయిమ్స్ కట్టింది కేంద్ర ప్రభుత్వమని అయితే కేంద్ర పథకాలకు జగన్ స్టిక్కర్ లు వేసుకుంటున్నారని ఫైర్ అయ్యారు. కరోనా కాలంలో పేదలకు ఉచితంగా వ్యాక్సిన్ ఇచ్చింది కూడా కేంద్రమేననఇ వెల్లడించారు.
Also Read: గుడిసెకు రూ. 62, 969 వేల కరెంట్ బిల్లు..ఉలిక్కిపడ్డ కుటుంబ సభ్యులు..!
రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దోపిడీ లపై బీజేపీ చర్చకు సిద్ధమన్నారు. కడప బెంగళూరు రైల్వే లైన్ కేంద్రం నిధులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంటే జగన్ యూ టర్న్ తీసుకున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ముద్ర లోన్ లు ఇచ్చింది కేంద్రమని తెలిపారు. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ అన్న జగన్ మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు. నిరుద్యోగ యువతను మోసం చేసిన జగన్.. పరదాల మాటున పర్యటిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఎన్నికలు ఫ్రీ అండ్ ఫెయిర్ గా జరుగుతాయన్నారు. ప్రతి ఒక్క ఓటరు నిర్భయంగా హక్కు వినుయోగించుకునేలా కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. ఎన్నికల్లో కేంద్ర బలగాలు ఉంటాయని స్పష్టం చేశారు.