West Bengal: కేంద్ర మంత్రిని గదిలో వేసి నిర్బంధించిన సొంతపార్టీ నేతలు! సొంత పార్టీ నేతలే మంత్రిని గదిలో పెట్టి తాళం పెట్టిన ఘటన పశ్చిమ బెంగాల్ (West bengal)లో చోటు చేసుకుంది. By Bhavana 13 Sep 2023 in నేషనల్ రాజకీయాలు New Update షేర్ చేయండి West Bengal Union Minister Subhas Sarkar locked up in Office: సొంత పార్టీ నేతలే మంత్రిని గదిలో పెట్టి తాళం పెట్టిన ఘటన పశ్చిమ బెంగాల్ (West Bengal)లో చోటు చేసుకుంది. పార్టీ కోసం రాత్రిబంవళ్లు కష్టపడి పని చేసిన వారికి గుర్తింపు ఇవ్వకుండా ఆయన ఇష్టారీతిన నచ్చిన వారికి అవకాశాలు ఇస్తుండడంతో కడుపు రగిలిన కార్యకర్తలు ఈ పని చేసినట్లు తెలుస్తుంది. మంత్రి ఓ నియంతలా వ్యవహరిస్తూ పార్టీ కార్యకర్తలకు అన్యాయం చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం బంకారాలోని బీజేపీ కార్యాలయంలో ఓ సమావేవంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన్ని పార్టీ కార్యకర్తలు ఓ గదిలో పెట్టి తాళం వేశారు. ఈ క్రమంలో ఆయన సిబ్బంది, ఆయన అనుచరులు ఆయన్ని విడిపించడానికి ప్రయత్నాలు చేశారు. This is not a Fake News @amitmalviya! Actual events unfolding in #WestBengal where Bakura BJP MP & Union Minister Mr. Subhas Sarkar is locked inside a room & had to face protest from BJP workers.#BengalRejectsBJP #IndiaRejectsBJP #ModiDisasterForIndia #GodiMedia #BJPFailsIndia pic.twitter.com/Ld2q0bCogf — Souvik Ghosal🇮🇳 (@SouvikKumarGho1) September 12, 2023 కానీ నేతలు, కార్యకర్తలు వారిని అడ్డుకోవడంతో ఆయన గదిలో చాలా సేపు ఉండిపోవాల్సి వచ్చింది. ఆయన వల్ల నియోజక వర్గానికి మేలు జరగకపోగా..నష్టమే ఎక్కువ జరుగుతున్నట్లు వారు తెలిపారు. కొద్ది రోజుల క్రితం జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా ఈయన వల్ల ఒక్క సీటు కూడా రాలేదని వారు ఆరోపిస్తున్నారు. అందినకాడికి దోచుకోవడం దాచుకోవడం అన్నట్లు మంత్రి పని ఉందని వారు తెలిపారు. దీంతో వారు మంత్రిని బంధించినట్లు తెలిపారు. దీంతో కొద్ది సేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. చివరికి పోలీసులు కలగజేసుకుని మంత్రిని విడిపించారు. ఈ చర్యకు పాల్పడిన వారిలో కొంతమందికి పోలీసులు నోటీసులు అందజేశారు. Also Read: నేడు “ఆయుష్మాన్ భవ” ప్రచారాన్ని ప్రారంభించనున్న రాష్ట్రపతి…లక్షలాది మందికి ఉచిత చికిత్స..!! #party-leaders #minister #west-bengal-union-minister-subhas-sarkar-locked-up-in-office #west-bengal-union-minister #subhas-sarkar-locked-up-in-office మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి