BJP Daggubati Purandeshwari: వైసీపీ సర్కార్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో ఐదేళ్లుగా దోపిడీ పాలన సాగించిన వైసీపీ ప్రభుత్వం ఈసారి ఎన్నికల్లో దొంగ ఓట్లనే నమ్ముకుందని కామెంట్స్ చేశారు. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక సమయంలో ఆ పార్టీ చేసిన అక్రమాలే అందుకు నిదర్శనమన్నారు. ఒక్క తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలోనే 35 వేల నకిలీ ఓటరు కార్డులు తయారుచేశారంటే..ఇంతకంటే అన్యాయం ఉంటుందా? అని ప్రశ్నించారు. ఇలాంటి చర్యల ద్వారా ఎన్నికల సంఘాన్ని ధిక్కరిస్తున్నారని వ్యాఖ్యానించారు.
Also Read: కర్నూలు వైసీపీ అభ్యర్థిగా IAS ఇంతియాజ్
కేంద్రం నిధులు ఇస్తున్నప్పటికీ, అన్నీ తామే చేస్తున్నట్లు వైసీపీ గొప్పలు చెప్పుకుంటుందన్నారు. అయితే, ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నేతలకు పురందేశ్వరి సూచించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ బలమైన శక్తిగా నిలుస్తుందని అన్నారు. రాష్ట్రంలో అవినీతి మరింత పెరిగిపోయిందన్నారు. ఇష్టం వచ్చినట్టు పన్నులు పెంచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉందని చెప్పుకొచ్చారు. ఏపీకి కేంద్ర ప్రభుత్వం 22 లక్షల ఇళ్లు కేటాయించిందని.. గత ప్రభుత్వం నిర్మించిన 3 లక్షల టిడ్కో ఇళ్లను కూడా ఇవ్వలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఉందని దుయ్యబట్టారు.
Also Read: తెలంగాణకు ద్రోహం చేసిన చరిత్ర కేసీఆర్‌దే..చేతగానితనంతోనే ఇలా చేశారు: చల్లా వంశీ
కట్టిన ఇళ్లు కూడా నాసిరకంగా ఉంటున్నాయని ఆరోపించారు. నెల్లూరు వద్ద పిల్లర్లు కూడా లేకుండా బీమ్ ల పైనే ఇళ్లు కట్టారని ధ్వజమెత్తారు. పునాదుల వద్ద బీమ్ ల కింద చేయి పెడితే.. చేయి ఇట్నుంచి అటు వచ్చేస్తోందన్నారు. పేదల జీవితాలతో ఏ రకంగా ఆడుకుంటున్నారో ప్రజలు గమనించాలని సూచించారు. శుద్ధమైన తాగునీటిని ఇంటింటికీ అందజేయాలని కేంద్రం జల్ జీవన్ పథకం ద్వారా వేలాది కోట్ల రూపాయల నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తుంటే..ఎన్ని ఇళ్లకు మీరు కుళాయి కనెక్షన్లు ఇచ్చారని అని పురందేశ్వరి ప్రశ్నించారు.