BJP: ఉత్తర తెలంగాణలో బీజేపీ హవా.. భారీగా ఓట్లు, మెరుగైన సీట్లు

ఉత్తర తెలంగాణలో కమల దళం పెద్దసంఖ్యలో ఓట్లతో సత్తాచాటింది. ఎన్నికల్లో ఆ పార్టీ గెలిచిన 8 సీట్లలో 7 ఉత్తర తెలంగాణ ప్రాంతానివే కావడం విశేషం. కామారెడ్డిలో అయితే డబుల్‌ జెయింట్‌ కిల్లర్‌ కాటిపల్లి వెంకటరమణారెడ్డి సంచలనం సృష్టించారు.

BJP: ఉత్తర తెలంగాణలో బీజేపీ హవా.. భారీగా ఓట్లు, మెరుగైన సీట్లు
New Update

BJP: మూడో వంతు సీట్లలో ఫలితాన్ని శాసించగల స్థాయిలో బీజేపీ పోటీ ఇస్తుందన్న విశ్లేషకుల అంచనా నిజమైంది. ఉత్తర తెలంగాణలో కమల దళం పెద్దసంఖ్యలో ఓట్లతో సత్తాచాటింది. ఎన్నికల్లో ఆ పార్టీ గెలిచిన 8 సీట్లలో 7 ఉత్తర తెలంగాణ ప్రాంతానివే కావడం విశేషం. కామారెడ్డి (Kamareddy)లో అయితే డబుల్‌ జెయింట్‌ కిల్లర్‌ కాటిపల్లి వెంకటరమణారెడ్డి సంచలనం సృష్టించారు. ఆదిలాబాద్‌, నిర్మల్‌ నియోజకవర్గాల్లో మంత్రులు కూడా బీజేపీ అభ్యర్థుల చేతిలో ఓటమి పాలు కావడం గమనార్హం.

ఇది కూడా చదవండి: బీఆర్‌ఎస్‌ ఓటమి సంతోషాన్నిచ్చింది: బండి సంజయ్‌

పూర్వ ఆదిలాబాద్‌ జిల్లాలో నాలుగు ఎమ్మెల్యే స్థానాలతో పాటు పూర్వ నిజామాబాద్‌ జిల్లాలో మూడు స్థానాల్లో బీజేపీ జెండా ఎగిరింది. ఆదిలాబాద్‌లో మాజీ మంత్రి జోగురామన్నపై పాయల్‌ శంకర్‌ విజయం సాధించగా, నిర్మల్‌లో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిపై మహేశ్వర్‌ రెడ్డి గెలుపొందారు. ఆర్మూర్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి వినయ్‌కుమార్‌ రెడ్డిపై పైడి రాకేశ్‌ రెడ్డి; నిజామాబాద్‌ అర్బన్‌లో మాజీ మంత్రి షబ్బీర్‌ అలీపై ధనపాల్‌ సూర్యనారాయణ విజయం సాధించారు. ముథోల్‌లో విఠల్‌ రెడ్డిపై బీజేపీ అభ్యర్థి రామారావు పటేల్‌; సిర్పూర్‌లో బీజేపీ అభ్యర్థి పాల్వాయి హరీశ్‌ గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. గోషామహల్‌లో మరోసారి రాజాసింగ్‌ విజయభేరి మోగించారు. కామారెడ్డిలోనైతే ఇద్దరు ముఖ్యమంత్రి అభ్యర్థులను బీజేపీ అభ్యర్థి వెంకట రమణారెడ్డి ఢీకొట్టి ఓడించారు.

పెరిగిన ఓట్ల శాతం:
గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి బీజేపీ సీట్లతో పాటు ఓట్ల శాతం భారీగా పెరిగింది. క్రితం ఎన్నికల్లో 6.9 శాతంగా ఉన్న తమ పార్టీ ఓటు బ్యాంకు ఈసారి 14 శాతానికి పెరిగిందని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. ఇది పార్లమెంటు ఎన్నికలకు బాగా ఉపయోగపడుతుందని పార్టీ నేతలు ఆశిస్తున్నారు. పార్టీ పార్లమెంటు సీట్ల సంఖ్యను 4 నుంచి ఇంకా పెంచుకునే వ్యూహాలను రూపొందించాలని పార్టీ రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది.

#telangana-elections-2023 #bjp-telangana
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe