బీజేపీ (BJP) సీనియర్ నేత మురళీధర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు మీడియాతో ఆయన చిట్ చాట్ చేశారు. రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) మళ్లీ బీజేపీ లోకి వస్తారని అన్నారు. బండి సంజయ్ (Bandi Sanjay) తొలగింపు విషయంలో తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో మురళీధర్ రావు ఆ అంశంపై సైతం స్పందించారు. బండి సంజయ్ సీఎం రేస్ లో ఉన్నాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయనను అధ్యక్ష పదవి నుంచి తొలగించారని వివరించారు.
ఇది కూడా చదవండి: ఎన్నికల బరిలో KA పాల్.. తొలి జాబితా విడుదల!
సీఎం రేస్ లో కిషన్ రెడ్డి లేడు అని అన్నారు మురళీధర్ రావు. కాబట్టే.. ఆయనకు అధ్యక్ష బాధ్యతలు అప్పగించారని తెలిపారు. తెలంగాణలో బీజేపీ తప్పకుండా అధికారంలో వస్తుందని మురళీధర్ రావు ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలకు మరికొన్ని వారాలే మిగిలి ఉన్న ఈ సమయంలో మురళీధర్ రావు చేసిన ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. బీజేపీలోనూ దీనిపై చర్చ జరుగుతోంది.
పార్టీ కేడర్ లో విశ్వాసం నింపేందుకు, బండి సంజయ్ తొలగింపుతో ఆయన అభిమానుల్లో నెలకొన్న నిరుత్సాహాన్ని తొలగించేందుకే మురళీధర్ రావు ఈ వ్యాఖ్యలు చేశారా? లేదా నిజంగానే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారా? అన్న అంశంపూ జోరుగా విశ్లేషణలు సాగుతున్నాయి.