బీజేపీ దూకుడు.. తెలంగాణ అభ్యర్థుల జాబితా ఎప్పుడంటే?

త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టింది. అన్ని పార్టీల కంటే ముందుగానే ఎన్నికల బరిలోకి దూకుతుంది. ఈ క్రమంలో ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించింది.

బీజేపీ దూకుడు.. తెలంగాణ అభ్యర్థుల జాబితా ఎప్పుడంటే?
New Update

ప్రత్యర్థులకు చెక్ పెట్టేందుకు అస్త్రాలు సిద్ధం..

త్వరలోనే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కమలం పార్టీ దూకుడు పెంచింది. కర్ణాటక ఎన్నికల పరాభవం నేపథ్యంలో ముందు జాగ్రత్తలు తీసుకుంటుంది. ప్రత్యర్థులకు చెక్ పెట్టేందుకు అస్త్రాలు సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించింది. ఈ రెండు రాష్ట్రాలకు చెందిన తొలి జాబితాల్లో ప్రముఖ నేతల పేర్లు లేకపోవడం గమనార్హం. మధ్యప్రదేశ్‌లో 39 మంది, ఛత్తీసగఢ్‌లో 21 మందితో లిస్ట్ రిలీజ్ చేసింది. మిగతా స్థానాలకు కూడా అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పడింది.

మధ్యప్రదేశ్‌లో 39 మంది, ఛత్తీసగఢ్‌లో 21 మందితో లిస్ట్..

ఛత్తీస్‌గఢ్‌ నుంచి ఐదుగురు మహిళలకు ఈ జాబితాలో చోటు దక్కింది. మొత్తం 90 స్థానాలకు గాను ఫస్ట్ లిస్టులో 21 మంది అభ్యర్థులను వెల్లడించింది. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం అసెంబ్లీ స్థానాలు 230 ఉండగా.. ముందుగా 39 మంది అభ్యర్థులను ప్రకటించింది. మిగిలిన అభ్యర్థులను దశల వారీగా వెల్లడించనుంది. ఈ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉండటం కలిసొచ్చే అంశం. అయితే గత ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాలు గెలిచి అధికారంలోకి వచ్చింది. అయితే తర్వాత కాంగ్రెస్ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దుతు ఇవ్వడంతో కమలం పార్టీ అధికారం చేపట్టింది. అయితే ఇప్పుడే ఇదే బీజేపీని కలవరపరుస్తోంది. దీంతో అధికారం చేజారకుండా వ్యూహాలు రూపొందించే పనిలో నిమగ్నమైంది.

సెప్టెంబర్ నెలలో తెలంగాణ అభ్యర్థుల జాబితా..

ఇక తెలంగాణ అభ్యర్థుల జాబితాపై కూడా బీజేపీ అధిష్ఠానం దృష్టి పెట్టింది. సెప్టెంబర్ నెలలో అభ్యర్థులను ప్రకటించనుందని తెలుస్తోంది. వచ్చే నెలలో జరిగే బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో తెలంగాణ, రాజస్థాన్ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేయనున్నట్లు సమాచారం. తెలంగాణలో నాలుగు విభాగాలు వ్యూహాన్ని ఫాలో అవ్వనుంది. గతంలో గెలిచిన స్థానాలు, ఒక్కసారి ఓడిన స్థానాలు, రెండు సార్లు ఓడిన నియోజకవర్గాలు, అసలు గెలవని నియోజవర్గాలను దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులను ఎంపిక చేయనుంది.

ఈనెల 27న తెలంగాణకు అమిత్ షా..

మరోవైపు బీఆర్‌ఎస్ అధినేత సీఎం కేసీఆర్ ఈనెల 21న అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాషాయం పెద్దలు కూడా అలర్డ్ అయ్యారు. గులాబీ పార్టీకి చెక్ పెట్టేలా అభ్యర్థుల జాబితా విడుదల చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా ముఖ్యనేతలు తెలంగాణలో వరుస పర్యటనలు చేపట్టనున్నారు. ఈనెల 27న కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. మరోవైపు రాష్ట్ర నేతలు వంద రోజుల ప్రణాళికతో జనాల్లోకి వెళ్లనున్నారు. ఉమ్మడి జిల్లాలను మూడు క్లస్టర్లుగా విభజించి బస్సు యాత్రలు చేయనున్నారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్ నేతృత్వంలో బస్సు యాత్రలు జరగనున్నాయి.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe