Telangana BJP: విజయశాంతికి షాక్ ఇచ్చిన బీజేపీ.. స్టార్ క్యాంపెయినర్ల లిస్ట్ ఇదే!

పార్టీ పై కొన్ని రోజులుగా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న విజయశాంతికి బీజేపీ హైకమాండ్ షాక్ ఇచ్చింది. ఈ రోజు 40 మందితో స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేయగా.. అందులో విజయశాంతికి చోటు దక్కలేదు.

New Update
Telangana BJP: విజయశాంతికి షాక్ ఇచ్చిన బీజేపీ.. స్టార్ క్యాంపెయినర్ల లిస్ట్ ఇదే!

విజయశాంతికి బీజేపీ (BJP) షాక్ ఇచ్చింది. ఈ రోజు 40 మందితో స్టార్ కాంపెయినర్ల జాబితాను పార్టీ విడుదల చేసింది. ఆ లిస్ట్ లో విజయశాంతికి (Vijayashanti) చోటు కల్పించలేదు. విజయశాంతి కొన్ని రోజులుగా పార్టీ నేతలను టార్గెట్ చేస్తూ ట్వీట్లు చేస్తోంది. ఆమె పార్టీ మారుతారన్న ప్రచారం సైతం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే విజయశాంతిని ఆ పార్టీ హైకమాండ్ పక్కకు పెట్టినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే తెలంగాణలో అధికారమే లక్ష్యంగా భారీ కసరత్తులు చేస్తున్న బీజేపీ ఎలాగైనా సత్తా చాటేందుకు పావులు కదుపుతోంది. మరో మూడు వారాల్లో ప్రచారం ముగియనుండగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతోంది. ఈ క్రమంలోనే రీసెంట్ గా స్టార్ క్యాంపెయినర్ ల లిస్ట్ రిలీజ్ చేసింది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల బీజేపీ ప్రముఖ నాయకులు తెలంగాణ వ్యాప్తంగా పర్యటిస్తూ ప్రచారం చేస్తుండగా.. నవంబర్ 7న మంగళవారం హైదరాబాద్ లో జరగనున్న బహిరంగ సభకు హాజరై మోదీ ప్రసంగించనున్నారు.
ఇది కూడా చదవండి: Telangana Election 2023: కరీంనగర్ చరిత్ర తిరగ రాస్తా.. భారీ మెజార్టీతో గెలుస్తా: బండి సంజయ్ నామినేషన్

జాతీయ అధ్యక్షులతో పాటు కేంద్ర మంత్రులు కూడా ప్రచారం చేయనున్నారు. ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తోపాటూ జేపీ నడ్డా, రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, కేంద్ర మహిళా మంత్రులు నిర్మలా సీతారామన్, స్మృతి ఇరానీ ప్రచారం చేయనున్నారు. అలాగే పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు కె. లక్ష్మణ్, బండి సంజయ్‌, ఈటల రాజేందర్ లు స్టార్ క్యాంపెయినర్ గా ఉన్నారు.

బీజేపీ విడుదల చేసిన క్యాంపెయినర్ల జాబితా
- నరేంద్ర మోదీ
- జేపీ నడ్డా
- రాజ్‌నాథ్ సింగ్
- అమిత్ షా
- నితిన్ గడ్కరీ
- యడ్యూరప్ప
- లక్ష్మణ్
- యోగి ఆదిత్యనాథ్
- పీయుష్ గోయల్
- నిర్మలా సీతారామన్
- స్మృతి ఇరానీ
- పురుషోత్తమ్ రుపాల
- అర్జున్ ముండా
- భూపేంద్ర యాదవ్
- కిషన్ రెడ్డి
- సాధ్వి నిరంజన్
- జ్యోతి మురుగన్
- ప్రకాశ్ జవదేకర్
- తరుణ్ చుంగ్
- సునీల్ బన్‌సాల్
- బండి సంజయ్
- అర్వింద్ మీనన్
- డీకే అరుణ

- మురళీధర్ రావు
- పురందేశ్వరీ
- రవి కిషన్
- పొంగులేటి సుధాకర్ రెడ్డి
- జితేంద్ర రెడ్డి
- గరికపాటి మోహన్ రావు
- ఈటల రాజేందర్
- ధర్మపురి అర్వింద్
- సోయం బాపూరావు
- రాజా సింగ్
- కొండా విశ్వేశ్వర్ రెడ్డి
- నర్సయ్య గౌడ్
- ప్రేమేందర్ రెడ్డి
- ప్రదీప్ కుమార్
- బంగారు శృతి
- కాసం వెంకటేశ్వర్లు
- కృష్ణ ప్రసాద్
publive-image

Advertisment
తాజా కథనాలు