BJP Purandeswari: 'ఆడుదాం ఆంధ్ర ఎమో గానీ ఆంధ్రాతో ఆడుకుంటున్నారు'

అధికార పార్టీ వైసీపీపై ఏపీ బీజేపీ అధ్యక్షరాలు పురందేశ్వరి కౌంటర్లు వేశారు. వైసీపీ కొత్తగా పెట్టిన ఆడుదాం ఆంధ్ర ఎమో గానీ ఆంధ్రాతో ఆడుకుంటున్నారని సెటైర్లు వేశారు.

New Update
BJP Purandeswari: 'ఆడుదాం ఆంధ్ర ఎమో గానీ ఆంధ్రాతో ఆడుకుంటున్నారు'

BJP Purandeswari: ఏలూరు జిల్లా జంగారెడ్డి గూడెం పర్యటనకు వచ్చిన ఏపీ బి.జే.పి. రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణ పనులను పరిశీలించారు. దేవరపల్లి-ఖమ్మం గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం 2024 సెప్టెంబర్ నెలాఖరకు పూర్తి అవుతుందని అధికారులు తెలిపారని దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. అనంతరం గురవాయిగూడెం లోని మద్ది ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించి స్వామి దర్శనం చేసుకున్నారు. అక్కడి నుంచి ర్యాలీగా జంగారెడ్డి గూడెం బయలుదేరిన ఆమె ఆర్డిఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తున్న అంగనవాడి వర్కర్ ద్వారా సమస్యలు తెలుసుకున్నారు. వారి సమస్యను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు.

Also Read: కేసీఆర్‌ ఫ్యామిలీ పాస్ పోర్టులు గుంజుకోండి .. బండి సంజయ్ సంచలన డిమాండ్

అనంతరం దండమూడి రామలక్ష్మి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పోలవరం ప్రాజెక్ట్ నుండి నీళ్లు తోడువలసిన పరిస్థితి నుండి ప్రతి రాజకీయ పార్టీ కూడా డబ్బులు తోడుకునే ప్రాజెక్ట్ గా మార్చివేసారని విమర్శించారు. పోలవరం ప్రాజెక్ట్ కు జాతీయ హోదా ఇచ్చిన నేపధ్యంలో ప్రాజెక్ట్ నిర్మాణానికి అయ్యే ఖర్చు ప్రతి పైసా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని ప్రజలందరూ గమనించాలని పురందేశ్వరి అన్నారు. త్వరలోనే పోలవరం పర్యటిస్తానని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు.

Also Read: దేశంలోకి కరోనా కొత్త సబ్ వేరియంట్.. ఎన్ని కేసులు నమోదయ్యాయంటే

ఈ క్రమంలోనే అధికార పార్టీ వైసీపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. వైసిపి కొత్తగా పెట్టిన ఆడుదాం ఆంధ్ర ఎమో గానీ ఆంధ్రాతో ఆడుకుంటున్నారన్నారు. అవినీతి, విషపూరితమైన వాతావరణం రాష్ట్రంలో నెలకొందనీ, ఎవరైనా ఎదురు తిరిగితే వారిపై కేసులు నమోదు చేస్తున్నారనీ, ఈ ప్రభుత్వం రాష్ట్రంలో ఏ వర్గానికి న్యాయం చేయలేదనీ విమర్శలు గుప్పించారు. టిడిపి హయాంలో అమరావతికి కేంద్ర ప్రభుత్వం రూ. 2500 కోట్లు ఇచ్చిందని, అందులో 500 కోట్లు విజయవాడకి, 500 కోట్లు గుంటూరు కి ఇచ్చామని తెలిపారు. అంతేకాక ఔటర్ రింగురోడ్డు కోసం 20 వేల కోట్లు అవుతుందని అంచనా వేశారని.. ఇవ్వడానికి మేం సిద్దంగా ఉన్న అప్పటి టిడిపి, ఇప్పటి వైసిపి ప్రభుత్వాలు ఇప్పటి వరకు లాండ్ అక్విజేషన్ చేయలేదన్నారు. ఆంధ్ర రాష్ట్ర రాజదాని అమరావతి అనే పార్లమెంట్ లో చెప్పామని, మా పొత్తు జనసేనతో ఉందనీ పురంధేశ్వరి అన్నారు.

Advertisment
తాజా కథనాలు