Amit Shah: కేసీఆర్ కారు స్టీరింగ్ ఒవైసీ చేతిలో ఉంది.. ఈసారి వచ్చేది బీజేపీ మాత్రమే

తెలంగాణలో కమలనాథులు ఎన్నికల శంఖారావం పూరించారు. ఖమ్మం వేదికగా రైతు గోస-బీజేపీ భరోసా సభ జరుగుతోంది. ఈ సభకు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

New Update
Amit Shah: కేసీఆర్ కారు స్టీరింగ్ ఒవైసీ చేతిలో ఉంది.. ఈసారి వచ్చేది బీజేపీ మాత్రమే

BJP Public Meeting: తెలంగాణలో కమలనాథులు ఎన్నికల శంఖారావం పూరించారు. ఖమ్మం వేదికగా జరిగిన రైతు గోస-బీజేపీ భరోసా సభ ముగిసింది. ఈ సభకు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే అని అమిత్ షా ధీమా వ్యక్తంచేశారు. కేసీఆర్ పేదలకు డబుల్ బెడ్రూల్ ఇళ్లు కట్టించలేదని, రైతులకు రుణాలు మాఫీ చేయలేదన్నారు. అన్ని వర్గాలను 9 ఏళ్లుగా మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ రైతుల కోసం బడ్జెట్ లో కేవలం రూ.20వేల కోట్లు పెడితే.. ప్రధాని మోదీ మాత్రం రూ.లక్ష కోట్ల బడ్జెట్ తెచ్చారని షా వెల్లడించారు.

అమిత్ షా సభలో తిరుమలను కాపాడాలంటూ ప్లకార్డులు దర్శనమిచ్చాయి. కొందరు వ్యక్తులు సేవ్ తిరుమల, సేవ్ టీటీడీ అనే ప్లకార్డులను ప్రదర్శించడం చర్చకు దారి తీసింది. సభ అనంతరం రాష్ట్ర బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో పాల్గొన్న అమిత్ షా.. వచ్చే ఎన్నికల కార్యాచరణ, అభ్యర్థుల ఎంపికపై ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేశారు.

అమిత్ షా ప్రసంగం హైలెట్స్.. 

► జై శ్రీరామ్ నినాదంలో ప్రసంగం ప్రారంభం

► కేసీఆర్ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ స్టార్ట్ అయింది

► కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలి

► తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే

► తెలంగాణ అభివృద్ధి చెందాలంటే రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలి

► తెలంగాణ అమరవీరులకు వందనం

► కాంగ్రెస్‌ సోనియా కుటుంబం కోసం పనిచేస్తోంది

►  BRS కల్వకుంట్ల కుటుంబం కోసం పనిచేస్తోంది

► కేసీఆర్ కారు స్టీరింగ్ ఎంఐఎం ఒవైసీ చేతిలో ఉంది

► ఒవైసీ చేతిలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు అవసరం లేదు

► భద్రాచలం రాముడికి పట్టు వస్త్రాలు సమర్పించే సంప్రదాయాన్ని కేసీఆర్ పట్టించుకోలేదు

► బీజేపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడితే భయపడం

► బండి సంజయ్‌ను అరెస్ట్ చేశారు.. ఈటలను అసెంబ్లీకి రాకుండా చేశారు

► కేసీఆర్, కేటీఆర్ కాదు.. ఇకపై వచ్చేది బీజేపీ సీఎం

► కాంగ్రెస్‌ 4G పార్టీ.. ఎంఐఎం 3G పార్టీ.. బీఆర్‌ఎస్ 2G పార్టీ

► 2G,3G, 4G కాదు.. ఇప్పుడు వచ్చేది మోదీజీ పార్టీ

► తెలంగాణ రైతులను కేసీఆర్ మోసం చేశారు

► ఉమ్మడి ఏపీకి కాంగ్రెస్ ఏం చేసిందో చెప్పాలి

► బీజేపీ ఎప్పుడూ బీఆర్ఎస్ పార్టీలో కలిసి వెళ్లదు

► కేసీఆర్ పార్టీని ఓడించడమే తమ లక్ష్యమే

► ఈసారి సీఎం అయ్యేది బీజేపీ నేత మాత్రమే

అంతకు ముందు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో అమిత్ షా గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు.  ఎయిర్ పోర్టులో ఏపీ హోం మంత్రి తానేటి వనిత షాకు ఘన స్వాగతం పలికారు. శాలువాతో ఆయనను సత్కరించి, పుష్పగుచ్ఛాలతో ఆహ్వానం పలికారు. అనంతరం అక్కడి నుంచి ఆర్మీ ప్రత్యేక హెలికాప్టర్ లో అమిత్ షా ఖమ్మం చేరుకున్నారు.

Advertisment
తాజా కథనాలు