లోక్‌సభ(LokSabha) జీరో అవర్ సమయంలో ఇద్దరు వ్యక్తులు చోరబడ్డ విషయం తెలిసిందే. ఎంపీలు అడ్డుకునేందుకు ప్రయత్నించిన సమయంలో ‘షూ’లోని కలర్ స్మోక్ గ్యాస్‌ను రిలీజ్ చేసి గందరగోళం సృష్టించారు. ఈ ఘటనతో యావత్ దేశం ఒక్కసారిగా షాక్ తిన్నది. 2001లో పార్లమెంట్(Parliament)పై దాడి జరిగిన సరిగ్గా 22ఏళ్లకు ఆగంతకులు పక్కాగా ప్లాన్ చేసుకోని లోక్‌సభలోకి చోరబడ్డారు. ఈ ఘటన వెనుక ఆరుగురు ఉన్నట్లు సమాచారం. అందులో ఇప్పటికే నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో కర్ణాటక-మైసూరు నుంచే ఇద్దరు ఉండడం చర్చనీయాంశమవుతోంది. వీరిలో సాగర్ శర్మ పేరు మారుమోగుతోంది. ఎందుకంటే సాగర్ శర్మ తీసుకొచ్చిన గెస్ట్ పాస్.. మైసూరు ఎంపీ ప్రతాప్ సింహ ఇచ్చినట్టు స్పష్టమవుతోంది. దీంతో ఆయనకు ఈ ఉచ్చు బిగుసుకుంది.
పాస్ ఇవ్వడానికి కారణం ఇదే!
లోక్‌సభ ఛాంబర్‌లోకి దూకిన వారిలో సాగర్ శర్మకు విజిటర్ పాస్ జారీ చేసిన బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా హౌస్ స్పీకర్ ఓం బిర్లాను కలిశారు. నిందితుడి తండ్రి సాగర్ శర్మ తన నియోజకవర్గం మైసూరులో నివసిస్తున్నారని, కొత్త పార్లమెంటు భవనాన్ని సందర్శించేందుకు పాస్‌ను అభ్యర్థించారని సింహ స్పీకర్‌కు తెలిపినట్లు సమాచారం. సాగర్ శర్మ పార్లమెంట్‌ను సందర్శించడానికి వీలుగా తన వ్యక్తిగత సహాయకుడు అతనితో నిరంతరం టచ్‌లో ఉన్నారని బీజేపీ ఎంపీ తెలిపారు. ప్రతాప్ సింహా పేరుతో జారీ చేసిన విజిటర్ పాస్‌ను సాగర్ శర్మ ఉపయోగించి లోక్‌సభలో ప్రవేశించినట్లు స్పష్టం కావడంతో మైసూరులోని ఆయన కార్యాలయం ముందు కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన చేపట్టారు. ప్రతాప్ సింహతో పాటు మోదీపైనే విమర్శలు గుప్పించారు.
సాగర్‌తో పాటు మైసూర్‌నుంచి వచ్చిన మరో వ్యక్తి మనోరంజన్. ఈ ఇద్దరూ మైసురుకు చెందినవారే. మైసూర్ వివేకానంద ఇనిస్టిట్యూట్‌లో సాగర్ చదువుతున్నట్లు సమాచారం. మూడు రోజుల క్రితం బెంగళూరు వెళ్తున్నామని చెప్పి ఇంటినుంచి వెళ్లిపోయారు సాగర్, మనోరంజన్. మనోరంజన్ ఇంజనీర్. ఇక పార్లమెంట్ భద్రతా వైఫల్యంపై సమగ్ర విచారణకు స్పీకర్ ఆదేశించారు. సిట్ ఏర్పాటు చేశారు. విజిటర్స్ పాస్‌లను ఇప్పటికే సస్పెండ్ చేశారు.
Also Read: అమిత్‌షా సమాధానం చెప్పాల్సిందే.. రేపు పార్లమెంట్‌ను కుదిపేయనున్న దాడి ఘటన!
WATCH: