Bandi Sanjay Comments on KTR: మాజీ సీఎం కేసీఆర్ (KCR) ఓటమికి ఆయన కొడుకు, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆరే కారణమంటూ బీజేపీ ఎంపీ బండి సంజయ్ (Bandi Sanjay) సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆరే సీఎం అంటూ బీఆర్ఎస్ నాయకులు అహంకారంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆ దురహంకారమే బీఆర్‌ఎస్‌ను ఓడించిందని, అయినా కేటీఆర్ తీరు మారడం లేదని విమర్శించారు. ఆ కుటుంబానికి ప్రజలు గుణపాఠం చెప్పినా బుద్ధి రాలేదంటూ దుయ్యబట్టారు. పదేళ్లు అబద్ధాలతో మోసం చేస్తూ కాలం గడిపారంటూ ధ్వజమెత్తారు. పార్లమెంటు ఎన్నికల్లో కరీంనగర్‌లో బీఆర్‌ఎస్‌కు మూడోస్థానమే గతి అని స్పష్టంచేశారు. కుహనా మేధావులను కరీంనగర్ ప్రజలు నమ్మరన్నారు.
పుణ్యక్షేత్రం యాదిగిరిగుట్టను వ్యాపార కేంద్రంగా మార్చిన ఘనత కేసీఆర్‌దే అని, కేటీఆర్ (KTR) కారణంగానే పార్టీ భ్రష్టుపట్టిందని మండిపడ్డారు. కేసీఆర్‌ను ఆయన కొడుకే టార్చర్ చేశారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్. పెద్దాయన ఓటమికి కేటీఆరే కారణమని వ్యాఖ్యానించారు.
పక్క జిల్లా నుంచి ఓ మేధావి ఇక్కడికొచ్చి తిరుగుతున్నారంటూ మాజీ ఎంపీ వినోద్‌పై ఎంపీ బండి సంజయ్ మండిపడ్డారు. టిప్పర్ లోడు దరఖాస్తులు పంపడమే తప్ప, కరీంనగర్‌లో తట్టెడు మట్టి కూడా వినోద్ పోయలేదని విమర్శించారు. సిద్ధిపేట- ఎల్కతుర్తి రోడ్డు పనులు చేయించింది తానేనని, శాతవాహన యూనివర్సిటీకి 12 బీ గుర్తింపు తెచ్చింది తానేనని అని బండి సంజయ్ చెప్పారు.
Bandi Sanjay: కేసీఆర్ ఓటమికి కేటీఆరే కారణం.. బీజేపీ ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
మాజీ సీఎం కేసీఆర్ (KCR) ఓటమికి ఆయన కొడుకు, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆరే కారణమంటూ బీజేపీ ఎంపీ బండి సంజయ్ (Bandi Sanjay) సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆరే సీఎం అంటూ బీఆర్ఎస్ నాయకులు అహంకారంతో మాట్లాడుతున్నారని విమర్శించారు.
Bandi Sanjay Comments on KTR: మాజీ సీఎం కేసీఆర్ (KCR) ఓటమికి ఆయన కొడుకు, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆరే కారణమంటూ బీజేపీ ఎంపీ బండి సంజయ్ (Bandi Sanjay) సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆరే సీఎం అంటూ బీఆర్ఎస్ నాయకులు అహంకారంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆ దురహంకారమే బీఆర్‌ఎస్‌ను ఓడించిందని, అయినా కేటీఆర్ తీరు మారడం లేదని విమర్శించారు. ఆ కుటుంబానికి ప్రజలు గుణపాఠం చెప్పినా బుద్ధి రాలేదంటూ దుయ్యబట్టారు. పదేళ్లు అబద్ధాలతో మోసం చేస్తూ కాలం గడిపారంటూ ధ్వజమెత్తారు. పార్లమెంటు ఎన్నికల్లో కరీంనగర్‌లో బీఆర్‌ఎస్‌కు మూడోస్థానమే గతి అని స్పష్టంచేశారు. కుహనా మేధావులను కరీంనగర్ ప్రజలు నమ్మరన్నారు.
ఇది కూడా చదవండి: రూ. 15 కోట్లిస్తేనే పోటీ అన్నారు.. డీకే అరుణపై వంశీచంద్ సంచలన ఆరోపణలు
పుణ్యక్షేత్రం యాదిగిరిగుట్టను వ్యాపార కేంద్రంగా మార్చిన ఘనత కేసీఆర్‌దే అని, కేటీఆర్ (KTR) కారణంగానే పార్టీ భ్రష్టుపట్టిందని మండిపడ్డారు. కేసీఆర్‌ను ఆయన కొడుకే టార్చర్ చేశారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్. పెద్దాయన ఓటమికి కేటీఆరే కారణమని వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి: రూ. 100 కోట్లు కూడబెట్టాడు.. ఏసీబీ వలలో అవినీతి తిమింగలం