Bandi Sanjay: అరెస్టుతో చంద్రబాబుకు ప్రజల్లో మైలేజ్ పెరిగింది.. వైసీపీ ప్రభుత్వంపై బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుపై తెలంగాణ నేతలు వరుసగా స్పందిస్తున్నారు. కొన్ని రోజులుగా మౌనంగా ఉన్న నాయకులు ఇప్పుడు తమ స్పందన తెలియజేస్తున్నారు. బాబు అరెస్టు పట్ల వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. By BalaMurali Krishna 14 Sep 2023 in Latest News In Telugu రాజకీయాలు New Update షేర్ చేయండి Bandi Sanjay: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుపై తెలంగాణ నేతలు వరుసగా స్పందిస్తున్నారు. కొన్ని రోజులుగా మౌనంగా ఉన్న నాయకులు ఇప్పుడు తమ స్పందన తెలియజేస్తున్నారు. బాబు అరెస్టు పట్ల వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు ఎఫ్ఐఆర్‌లో పేరు లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారని మండిపడ్డారు. ఏదైనా ఉంటే రాజకీయంగా కొట్లాడాలే తప్ప ఇలాంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం మంచి పద్ధతి కాదని తెలిపారు. 14 సంవత్సరాలు సీఎంగా పనిచేసిన వ్యక్తిని కనీసం రూల్స్ పాటించకుండా అంతా హడావిడిగా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏం ఉందని ప్రశ్నించారు. అలాగే వైసీపీ నేతలకు ఓ దరిద్రపు అలవాటు ఉందని.. నిజాలు మాట్లాడినందుకు ఇప్పుడు తనను కూడా చంద్రబాబు ఏజెంట్ లేదా పవన్ కల్యాణ్ ఏజెంట్ అంటారని సెటైర్లు వేశారు. వైసీపీ నాయకులు ఏమైనా నీతిమంతులా..? సత్యహరిశ్చంద్రులా..? అని దుయ్యబట్టారు. చంద్రబాబు అరెస్ట్ వైసీపీకి చాలా మైనస్.. చంద్రబాబు అరెస్ట్ వైసీపీకి చాలా మైనస్ అని వాళ్లు తవ్వుకున్న గోతిలో వాళ్లే పడ్డారని హెచ్చరించారు. ప్రతిష్టాత్మకమైన G20 సమావేశాలు జరుగుతున్నప్పుడే అరెస్టుకి సమయం కుదిరిందా అని ప్రశ్నించారు. ఇప్పుడు ప్రజల్లో చంద్రబాబుకు భారీగా మైలేజ్ పెరిగిందని.. ఎక్కవ చూపినా జగన్ సర్కార్ తప్పు చేసిందని అంటున్నారన్నారు. ఎవరైనా తప్పు చేస్తే అరెస్ట్ చేసి శిక్షించాలి కానీ.. ఇలా కక్షపూరితంగా అరెస్ట్ చేయడం సమంజసం కాదని పేర్కొన్నారు. బాబు అరెస్టుపై ప్రజల్లో వ్యతిరేకత వస్తోందని, తిరగబడే పరిస్థితి వస్తోందని.. రాజకీయాలతో సంబంధం లేకుండా అన్ని రాజకీయ పార్టీలు చంద్రబాబు అరెస్టును ఖండిస్తున్నాయని సంజయ్ వెల్లడించారు. చంద్రబాబును జైల్లోనే ఉంచుతామని..బయటకు రానీయమని అంటే... ప్రజలు హర్షించరని, ఎందుకు బయటకు రానీయరని ఎన్నికల సమయంలో ప్రశ్నిస్తారని చెప్పారు. రెండు రాజకీయ పార్టీల మధ్య జరుగుతున్న గొడవ.. మరోవైపు బీఆర్ఎస్ మంత్రి హరీష్ రావు కూడా బాబు అరెస్టుపై స్పందించారు. ఇది కేవలం రెండు రాజకీయ పార్టీల మధ్య జరుగుతున్న గొడవ అన్నారు. దాంతో బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేదని స్పష్టంచేశారు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని వ్యాఖ్యానించారు. మరోవైపు చంద్రబాబు అరెస్టుకు నిరసనగా తెలంగాణలో కూడా పలు చోట్ల ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి. బుధవారం హైదరాబాద్ హైటెక్ సిటీలోని విప్రో సర్కిల్‌లో ఐటీ ఉద్యోగులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. ఇది కూడా చదవండి: వచ్చే ఎన్నికల్లో జనసేన- తెలుగుదేశం కలిసి పోటీచేస్తాయి: పవన్ #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి