Modi Govt New Scheme: ఇళ్లు కొనే వారికి మోదీ సర్కార్ శుభవార్త.. రూ.9 లక్షల మేర బెనిఫిట్.. వివరాలివే!

ఇళ్లు కొనే వారికి మోదీ సర్కార్ గుడ్ న్యూస్‌ చెప్పనుంది. అద్దె ఇండ్లలో నివసిస్తున్న మధ్య తరగతి కుటుంబాలకు కేంద్రం ప్రభుత్వం హోమ్ లోన్ల వడ్డీ భారంలో కొంత భాగాన్ని పంచుకోనుంది. ఇందుకోసం త్వరలో రూ.60 వేల కోట్లతో ఓ కొత్త స్కీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తీసుకురానున్నట్లు తెలుస్తోంది. మోదీ ప్రభుత్వం వచ్చే ఏడాది ఎలక్షన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను దృష్టిలో పెట్టుకొని కొత్త కొత్త స్కీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు తెస్తోంది.

New Update
Modi Govt New Scheme: ఇళ్లు కొనే వారికి మోదీ సర్కార్ శుభవార్త.. రూ.9 లక్షల మేర బెనిఫిట్.. వివరాలివే!

Modi Govt New Scheme: ఇళ్లు కొనే వారికి మోదీ సర్కార్ గుడ్ న్యూస్‌ చెప్పనుంది. అద్దె ఇండ్లలో నివసిస్తున్న మధ్య తరగతి కుటుంబాలకు కేంద్రం ప్రభుత్వం హోమ్ లోన్ల (Home Loan) వడ్డీ భారంలో కొంత భాగాన్ని పంచుకోనుంది. ఇందుకోసం త్వరలో రూ.60 వేల కోట్లతో ఓ కొత్త స్కీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఈ స్కీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కొన్ని రాష్ట్రాలలో జరగనున్న ఎలక్షన్స్ ముందు అమల్లోకి తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. మోదీ ప్రభుత్వం వచ్చే ఏడాది ఎలక్షన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను దృష్టిలో పెట్టుకొని కొత్త కొత్త స్కీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు తెస్తోంది. రిసెంట్ గా కుకింగ్ గ్యాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై 18 శాతం రాయితీని ప్రకటించారు.. తాజాగా అఫోర్డబుల్ హౌసింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది.

ఈ స్కీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద్వారా సిటీలలో నివసిస్తున్న దాదాపు 25 లక్షల మంది అభ్యర్ధులు ప్రయోజనం పొందే అవకాశం కనిపిస్తోంది. ప్రభుత్వం ఇచ్చే వడ్డీ సబ్సిడీ సంబంధిత ఇల్లుకు ఉన్న డిమాండ్ బట్టి మారుతుందని  ప్రభుత్వ అధికారులు వ్యాఖ్యనించారు. ‘సిటీల్లోని స్లమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో, కిరాయి ఇండ్లలో, గుర్తింపులేని కాలనీలలో ఉంటున్న వారికి మేలు చేసేందుకు త్వరలో ఓ స్కీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో వస్తాం’ అని గతంలో  ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) తన స్పీచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పేర్కొన్నారు. ఈ స్కీమ్ కింద ఎంత మేర అప్పులివ్వాలనే టార్గెట్ ఏం లేదని, ప్రభుత్వ అధికారులతో త్వరలో ఓ సమావేశం ఉంటుందని బ్యాంక్ అధికారులు వెల్లడించారు. ఈ మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ముందు అర్హులను గుర్తించే పనిలో బ్యాంకులు ఉన్నాయని సమాచారం. ఈ స్కీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వలన తమ హోమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లోన్ పోర్టుఫోలియోలో అఫోర్డబుల్ హౌసింగ్ లోన్లు పెరుగుతాయని వివరించారు. కాగా, హోమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లోన్లపై వడ్డీ రాయితీలు ఇవ్వడం ఇదేమి ఫాస్ట్ టైం కాదు. 2017–2022 మధ్య సిటీలలో నివసిస్తున్న 1.22 కోట్ల మంది లబ్ధిదారులకు ప్రభుత్వం వడ్డీ రాయితీ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.

బారోవర్ల హోమ్ లోన్లపై పడే వడ్డీలో 3 శాతం నుంచి 6.5 శాతం వరకు ప్రభుత్వం రాయితీ ఇవ్వనున్నారని ప్రచారం జరుగుతోంది. ఇది కానీ నిజం అయితే, గరిష్టంగా రూ.9 లక్షల వరకు వడ్డీ భారం తగ్గుతుంది. రూ.50 లక్షల కంటే తక్కువ అమౌంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను 20 ఏళ్ల కాల పరిమితికి గాను తీసుకున్న వారు ఈ స్కీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఎలిజబుల్ అవుతారు. అయితే, స్కీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సంబంధించి పూర్తి డిటైల్స్ ఇంకా బయటకు రాలేదు. రాయితీని ఇప్పటికే హోమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లోన్లు తీసుకున్న వారికి ఇస్తారా? లేదా కొత్తగా లోన్ తీసుకునేవారికి ఇస్తారా? అనేది తెలియాల్సి ఉంది. అర్హులను గుర్తించే పనిలో బ్యాంకులు ఉన్నాయని రాయిటర్స్ వెల్లడిస్తున్నారు. ‘అర్హుల హౌసింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లోన్ అకౌంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వడ్డీ రాయితీని ప్రభుత్వం ముందుగానే క్రెడిట్ చేస్తుందని.. ఈ స్కీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చివరి దశలో ఉందని.. అయితే, అమల్లోకి తీసుకురావడానికి కేబినెట్ ఆమోదం అవసరం’ అని ఒక అధికారిని కోట్ చేస్తూ రాయిటర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిపోర్ట్ చేసింది.

Also Read: గ్రూప్-1 రద్దుపై హైకోర్టులో విచారణ.. టీఎస్పీఎస్సీకి కీలక ఆదేశాలు

Advertisment
Advertisment
తాజా కథనాలు