Raja Singh: రూ.500 కోట్లు ఖర్చు చేసినా నేనే గెలుస్తా: సస్పెన్షన్ ఎత్తివేసిన తర్వాత రాజాసింగ్ సంచలన ఇంటర్వ్యూ రూ.500 కోట్లు ఖర్చు చేసినా తన గెలుపును అడ్డుకోలేరని గోషామహల్ బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ ధీమా వ్యక్తం చేశారు. తనపై సస్పెన్షన్ ఎత్తి వేసినందుకు మోడీ, అమిత్ షా, నడ్డాకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. రానున్న తెలంగాణ ఎన్నికల్లో బీజేపీకి 80-90 సీట్లు రావడం ఖాయమన్నారు. By Nikhil 22 Oct 2023 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి వివాదాస్పద వాఖ్యల నేపథ్యంలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను (Raja Singh) గతేడాది బీజేపీ హైకమాండ్ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఆ సస్పెన్షన్ ను ఈరోజు ఎత్తివేసింది బీజేపీ హైకమాండ్. అనంతరం మరో సారి టికెట్ ను కూడా కేటాయించింది. ఈ సందర్భంగా రాజా సింగ్ మాట్లాడుతూ.. సస్పెన్షన్ ఎత్తి వేసినందుకు మోడీ, అమిత్ షా, నడ్డాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తాను పార్టీ లైన్ ఎప్పుడు దాటలేదన్నారు. బీఆర్ఎస్ కు లాభం చేకూర్చేందుకే కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థిని గోషామహల్ లో పెట్టిందన్నారు. 2014, 2018 లో తెలంగాణ ప్రజలను మోసం చేసి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందన్నారు. రానున్న ఎన్నికల్లో బీజేపీకి 80 నుంచి 90 సీట్లు వస్తాయని జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ డబ్బులు పంచి గెలవాలని చూస్తోందని ఆరోపించారు. పోలీస్ వాహనాల్లో ఆ పార్టీ డబ్బులు తరలిస్తోందన్నారు. బీఆర్ఎస్ రూ.500 వందల కోట్లు ఖర్చు చేసినా నేనే గెలుస్తానన్నారు. ఆయన ఇంకా ఏమన్నారో ఈ కింది ఇంటర్వ్యూలో చూడండి. ఇదిలా ఉంటే.. సస్పెన్షన్ ఎత్తివేసిన తర్వాత బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి రాజాసింగ్ ఈ రోజు వచ్చారు. భారీ ర్యాలీతో రాజాసింగ్ పార్టీ కార్యాలయానికి వచ్చారు. ఏడాది తర్వాత బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన రాజాసింగ్ కు పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి. #telangana-elections-2023 #bjp-mla-raja-singh మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి