Raghunandan Rao: అప్పుడు ఎలా ఆపుతారో చూస్తాం.. సంచలన కామెంట్స్ చేసిన ఎమ్మెల్యే రఘునందన్..

ఇతర రాష్ట్రాల నుంచి కాళేశ్వరం ప్రాజెక్టును చూడటానికి వచ్చిన వారికి హెలికాప్టర్లు ఏర్పాటు చేసిన కేసీఆర్.. పొరుగు నియోజకవర్గం వాళ్లు గజ్వేల్ అభివృద్ధిని చూసేందుకు వెళ్తే కేసీఆర్ ఎందుకు ఉలికిపాటుకు గురవుతున్నారని ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రశ్నించారు.

New Update
TS News : సీఎం రేవంత్ పై ఈసీకి రఘునందన్ రావు ఫిర్యాదు!

MLA Raghunandan Rao: గజ్వేల్ అభివృద్ధి అంశంపై జరుగుతున్న వివాదంలో తగ్గేదేలే అంటున్నారు బీజేపీ నేతలు. గజ్వేల్ అభివృద్ధిని పరిశీలించాల్సిందే.. జనాలకు నిజాలు చెప్పాల్సిందేనంటూ పట్టుబడుతున్నారు. మొన్నటికి మొన్న ఇదే అంశంపై కామారెడ్డికి చెందిన మాజీ జెడ్పీ చైర్మన్ వెంకట రమణా రెడ్డి గజ్వేల్‌ అభివృద్ధి ఏంటో చూస్తానంటూ బయలుదేరగా.. అయన్ను అరెస్ట్ చేశారు పోలీసులు. దాంతో మొదలైన వివాదం.. రోజు రోజుకు మరింత రచ్చగా మారుతోంది. తాజాగా ఇదే అంశంపై దుబ్బాక ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు రఘునందన్ రావు సంచలన కామెంట్స్ చేశారు. శనివారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇతర రాష్ట్రాల నుంచి కాళేశ్వరం ప్రాజెక్టును చూడటానికి వచ్చిన వారికి హెలికాప్టర్లు ఏర్పాటు చేసిన కేసీఆర్.. పొరుగు నియోజకవర్గం వాళ్లు గజ్వేల్ అభివృద్ధిని చూసేందుకు వెళ్తే కేసీఆర్ ఎందుకు ఉలికిపాటుకు గురవుతున్నారని ప్రశ్నించారు.

'మీరు చేసిన అభివృద్ధిని చూసేందుకే వెళ్తామన్నాం కదా? నీ ఫామ్‌ హౌజ్ కాదు కదా?' అంటూ ప్రభుత్వం తీరుపై ఫైర్ అయ్యారు రఘునందన్ రావు. వెంకట రమణా రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన విధానాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. రాత్రి 8 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు వెంకటరమణను రోడ్డుమీదే తెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడికి తీసుకెళ్లారని అడిగేందుకు వెళ్తేఏ.. వారిపై లాఠీ ఛార్జ్ చేశారని పోలీసుల తీరుపై నిప్పులు చెరిగారు. తెలంగాణలో రాష్ట్ర ప్రజలకు హక్కులు ఉన్నాయా? నిజంగా అక్కడ జరిగింది అభివృద్ధే అయితే చూపించేందుకు భయమెందుకు? అని రాష్ట్ర డీజీపీని ప్రశ్నించారు రఘునందన్ రావు.

'పోలీసులను అడ్డం పెట్టుకొని గజ్వేల్ వెళ్లకుండా తాత్కాలికంగా మాత్రమే అపగలిగారు. ముందు ముందు చెప్పకుండానే మీడియాను తీసుకొని గజ్వేల్‌లో పర్యటిస్తాం. అప్పుడు ఎలా ఆపుతారో చూస్తాం. జరుగుతున్న పరిణామాలు అన్నింటికీ రానున్న రోజుల్లో డిజిపికి బరాబర్ సమాధానం ఇస్తాం.' అని సీరియస్ కామెంట్స్ చేశారు రఘునందన్ రావు.

పార్టీ మారుతారా? క్లారిటీ ఇచ్చిన రఘునందన్..

అయితే, గత కొంతకాలంగా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పార్టీ మారుతారంటూ విపరీతమైన ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై తాజాగా ఆయన మాట్లాడారు. పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చారు. తాను పార్టీ మారే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. తనపై చేస్తున్న దుష్ప్రచారాలను మానుకోవాలని కోరారు రఘునందన్ రావు. రానున్న ఎన్నికల్లో దుబ్బాక నుంచే బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తానని, తప్పకుండా గెలిచి అసెంబ్లీలో అడుగు పెడతానని విశ్వాసం వ్యక్తం చేశారు రఘునందన్ రావు.

Also Read: TBJP: బీజేపీ అభ్యర్థుల ఎంపిక షూరు.. దరఖాస్తులకు ఆహ్వానం

Twitter War: రేవంత్ రెడ్డి, కవిత మధ్య ట్వీట్ వార్

Advertisment
తాజా కథనాలు