BJP Meeting: ఈ విజయానికి కార్యకర్తలే కారణం.. బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని మోదీ 

బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఢిల్లీలో ఈరోజు జరిగింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఇటీవలి శాసన సభ ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో గెలుపునకు కార్యకర్తలే కారణం అని చెప్పారు. తెలంగాణ లోనూ, బీజేపీలోనూ తమ బలం పెరిగిందని పేర్కొన్నారు. 

New Update
BJP Meeting: ఈ విజయానికి కార్యకర్తలే కారణం.. బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని మోదీ 

BJP Meeting భారతీయ జనతా పార్టీ  పార్లమెంటరీ పార్టీ సమావేశం ఈ రోజు పార్లమెంటు హౌస్ కాంప్లెక్స్ లో జరిగింది. ఇందులో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా సహా పలువురు మంత్రులు, నేతలు పాల్గొన్నారు. మూడు రాష్ట్రాల్లో బీజేపీ ఘన విజయం సాధించినందుకు ప్రధాని మోదీకి నేతలు స్వాగతం పలికారు. 'మోదీకి స్వాగతం' అంటూ నేతలు నినాదాలు చేశారు. సమావేశం అనంతరం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మీడియాకు వివరాలు వెల్లడించారు. 

మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్, రాజస్థాన్ లలో బీజేపీ విజయానికి కార్యకర్తలే కారణమని ప్రధాని ఈ సమావేశంలో(BJP Meeting) పేర్కొన్నారని చెప్పారు. అలాగే మూడు రాష్ట్రాల్లో మంచి విజయం సాధించామని, తెలంగాణ, మిజోరంలో తమ బలం పెరిగిందని ప్రధాని అన్నారని తెలిపారు. అంతేకాకుండా తమిళనాడు-ఆంధ్రప్రదేశ్ లో మిచాంగ్ తుఫాను వల్ల జరిగిన నష్టంపై కూడా ప్రధాని మాట్లాడినట్లు వెల్లడించారు. 

ఈ సమావేశంలో(BJP Meeting) మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఎంపికపై చర్చించే అవకాశం ఉందని, అయితే దీనికి సంబంధించిన సమాచారం ఇంతవరకు వెల్లడి కాలేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. బీజేపీ ఈసారి యువ ముఖాలకు అధికార పగ్గాలు అప్పగించవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Also Read: AM, PM తేడా తెలియకపోతే ఆయనెలా ప్రధాని కాగలరు? జీవిత పుస్తకంలో ‘ప్రణబ్‌’ ఎద్దేవా!

అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 12 మంది బీజేపీ ఎంపీల్లో 10 మంది లోక్ సభ ఎంపీ పదవులకు రాజీనామా చేసిన మరుసటి రోజే ఈ సమావేశం జరగడం గమనార్హం. రాజస్థాన్ నుంచి గెలిచిన మహంత్ బాలక్ నాథ్ ఇంకా రాజీనామా చేయలేదు.

మధ్యప్రదేశ్ కు రాజీనామా చేసిన వారిలో నరేంద్ర సింగ్ తోమర్, ప్రహ్లాద్ సింగ్ పటేల్, రాకేష్ సింగ్, ఉదయ్ ప్రతాప్, రితి పాఠక్ ఉన్నారు. ఛత్తీస్ గఢ్ కు చెందిన అరుణ్ సావో, గోమతి సాయి, రాజస్థాన్ కు చెందిన రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్, దియా కుమారి, కిరోరి లాల్ మీనా ఉన్నారు.

సభ్యత్వాన్ని వదులుకున్న ఎంపీల సీట్ల సంగతేంటి?

ఒక వ్యక్తి ఒకేసారి పార్లమెంటు- శాసనసభ సభ్యుడిగా ఉండకూడదు. ఒక వ్యక్తి పార్లమెంటు - శాసనసభ రెండింటికీ ఎన్నికైతే, అతను 14 రోజుల్లో అసెంబ్లీ స్థానాన్ని ఖాళీ చేయాల్సి ఉంటుంది, లేకపోతే అతని పార్లమెంటు సభ్యత్వం రద్దు అవుతుంది. నిబంధనల ప్రకారం పార్లమెంటు లేదా శాసనసభకు రాజీనామా చేసిన వ్యక్తి ఖాళీ చేసిన స్థానాన్ని భర్తీ చేయడానికి ఆరు నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాలి. 2024 మే నాటికి కొత్త ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో ఖాళీ అయిన ఎంపీ స్థానాలకు వచ్చే ఏడాది ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది.

Watch this interesting Video:

Advertisment
Advertisment
తాజా కథనాలు