Telangana: తెలంగాణ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో మరోసారి వాస్తు మార్పు ఆసక్తిగా మారింది. నాంపల్లిలోని బీజేపీ(BJP) ప్రధాన కార్యాలయంలో తూర్పు ద్వారాన్ని మూసివేశారు. ఉత్తర ద్వారం నుంచి కార్యాలయంలోకి రాకపోకలు సాగిస్తున్నారు. తెలంగాణ ఎన్నికల పోలింగ్ నుంచి ఫలితాల ప్రకటన వరకు తూర్పు ద్వారం మూసివేయాలని బీజేపీ రాష్ట్ర నేతల ఆదేశాలతో సిబ్బంది ఈ మార్పులు చేసినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ సరళి అనుకూలంగా ఉందని ధీమాతో ఉన్న బీజేపీ నేతలు.. అన్నీ కలిసొస్తే ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారుతామనే విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు వాస్తు నిపుణుల సూచనలతో పార్టీ ఆఫీస్‌లోని తూర్పు ద్వారాన్ని క్లోజ్ చేసి.. నార్త్ వైపు గుండా రాకపోకలు సాగించేలా మార్పులు చేసినట్లు తెలుస్తోంది. అయితే గతంలోనూ పలు సందర్భాల్లో వాస్తు మార్పులు చేపట్టిన బీజేపీ నేతలు.. తాజాగా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముంగిట్లో ఈ మార్పులు చేర్పులు చేయడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. కాషాయ పార్టీలో ఈ కొత్త నమ్మకం ఏ మేరకు కలిసి వస్తుందో డిసెంబర్ 3న వెలువడే ఫలితాలతో తేలనుంది.
Also Read:
చాలారోజుల తర్వాత హాయిగా పడుకున్న.. కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
40% ఓట్లు వచ్చిన వారికి పవర్.. ప్రభుత్వం ఏర్పాటు చేసే పార్టీ ఏది?