Yamini Sharma: వైసీపీకి బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి: యామిని

వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యామినిశర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం, ఇసుక దందాలను నిలదీస్తే వ్యక్తిగత విమర్శలకు దిగుతారా అని నిలదీశారు. దమ్ముంటే మద్యంపై సమాధానం చెప్పండి లేదంటే సిగ్గుతో చెంపలేసుకోండని సూచించారు.

Yamini Sharma: వైసీపీకి బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి: యామిని
New Update

Yamini Sharma: వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యామినిశర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం, ఇసుక దందాలను నిలదీస్తే వ్యక్తిగత విమర్శలకు దిగుతారా అని నిలదీశారు. దమ్ముంటే మద్యంపై సమాధానం చెప్పండి లేదంటే సిగ్గుతో చెంపలేసుకోండని సూచించారు. ఏపీలో వైసీపీ పరిస్థితి ఆడలేక మద్దెల దరువు అన్న విధంగా ఉందన్నారు. జగన్ మద్యం అక్రమాలను మా పార్టీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి ఆధారాలతో చూపిస్తే తట్టుకోలేకపోయారని పేర్కొన్నారు. వైసీపీ నేతల అరాచకాలు, అవినీతిని ప్రశ్నిస్తే కేసులు పెడతారా..? అని ప్రశ్నించారు.

ఒక మహిళ అనే ఇంగితం కూడా లేకుండా వ్యక్తిగత విమర్శలకు దిగుతారా..? అధికారం ఇస్తే మంచి పాలన అందించడం చేతకాదని తీవ్ర విమర్శలు చేశారు. మా మానసిక స్థైర్యాన్ని దెబ్బ తీయాలని చూస్తున్నారని మండిపడ్డారు. ప్రజలకు మంచి పాలన ఇస్తారనే వైసీపీకి అధికారం ఇచ్చారని... వైసీపీ నాయకులు ఇంత నీచంగా దిగజారి మాట్లాడతారా..? మీ లాంటోళ్లకు తగిన బుద్ధి చెప్పే ధైర్యం, దమ్ము బీజేపీకి ఉన్నాయని ఆమె హెచ్చరించారు. రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలు జగన్ పాలన ఎప్పుడు పోతుందా అని ఎదురు చూస్తున్నారన్నారు. ప్రజలకు మంచి పాలన చేయండి.. లేదంటే ప్రజలే మీకి బుద్ధి చెబుతారని యామిని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో పరిస్థితిపై అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారని బిజెపి మైనారిటీ మోర్చా అధ్యక్షులు షేక్ బాజీ తెలిపారు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతుందని.. బడ్డీ కొట్లో టీ తాగినా ఫోన్ పే ఉంటుందని.. కానీ వందలు, వేల రూపాయలు పెట్టి కొనే మద్యం సీసాకు మాత్రం డిజిటల్ పేమెంట్స్ ఉండవన్నారు. మీ అరాచకాలు, అవినీతిని ప్రశ్నిస్తే కేసులు పెడతారా అని ప్రశ్నించారు. పురందేశ్వరి అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక నోటికొచ్చినట్లు తిట్టిస్తారా అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

డబ్బులు తీసుకుని మాట్లాడే పెయిడ్ ఆర్టిస్టుల మాటలను తాము పట్టించుకోమన్నారు. పాదయాత్రలో జగన్ ఇచ్చిన హామీలు ఎక్కడ అని నిలదీశారు. కేంద్రం కోట్ల రూపాయలు నిధులు రాష్ట్రానికి ఇస్తే జగన్ తన స్వార్థానికి వాడుకుంటున్నారని ఆరోపించారు. మహిళలపై వైసీపీ నాయకులకు ఏమాత్రం గౌరవం లేదని మండిపడ్డారు. ఏపీ పోలీసులపై నమ్మకం లేదని చెప్పిన జగన్.. ఇప్పుడు అదే పోలీసులను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. 16 నెలల పాటు జైల్లో ఉన్న వ్యక్తిని ప్రజలు నమ్మారని పేర్కొన్నారు. రైతులు, ఉద్యోగులు అందరూ జగన్‌ను ఎప్పుడు తరిమి కొడదామా అని ఎదురు చూస్తున్నారని ఆయన వెల్లడించారు.

ఇది కూడా చదవండి: వ్యవస్థలను మేనేజ్ చేయడంలో సీఎం జగన్ దిట్ట: నాగబాబు

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి