ఇటీవల జరిగిన పరిణామాలతో బీజేపీకి (BJP) సిద్ధాంతాలు లేవని తెలిసిపోయిందని తెలిందని తుల ఉమ (Tula Uma) అన్నారు. బీసీలు, మహిళలకు ఆ పార్టీలో ప్రాధానత్య లేదని కూడా స్పష్టమైందన్నారు. బీసీ ముఖ్యమంత్రి అన్న హామీ కూడా బూటకమని ధ్వజమెత్తారు. ఈ రోజు తుల ఉమ మీడియాతో మాట్లాడారు. బీసీలను అణగదొక్కి ఆ స్థానంలో దొరలకు అవకాశం ఇస్తే.. బీసీ ముఖ్యమంత్రి ఎలా అవుతారని ప్రశ్నించారు. వారసత్వ రాజకీయాలు బీజేపీలో ఉండవని అమిత్ షా (Amit Shah), మోదీ అనేక సార్లు చెప్పారని గుర్తు చేశారు. మరి వేములవాడలో మీరు చేసిందేంటి? అని ప్రశ్నించారు. తనకు టికెట్ ఇచ్చినట్లే ఇచ్చి మళ్లీ వెనక్కి తీసుకోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: పార్టీనే చచ్చిందన్నావ్.. ఇప్పుడెలా కార్యకర్తల వద్దకు వెళ్తావ్?.. కోమటిరెడ్డిపై స్రవంతి ఫైర్..
మూడు నెలల క్రితం పార్టీలోకి వచ్చిన మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు కుమారుడికి టికెట్ ఎలా ఇస్తారని ధ్వజమెత్తారు. ట్యాక్స్ ఎగ్గొట్టడానికే ఇక్కడ వారు సేవా పేరుతో కార్యక్రమాలు నిర్వహించారని ఆరోపించారు. దోచుకున్న, దాచుకున్న డబ్బులకు రక్షణ కావడానికే ఆ కుటుంబానికి రాజకీయాలు కావాలన్నారు. మనలను దెబ్బ తీసిన దొరలను తిరిగి దెబ్బతీసేలా పట్టుదల పెంచుకోవాలని.. అంతే కానీ అధైర్య పడొద్దని అనుచరులకు తుల ఉమ పిలుపునిచ్చారు. పార్టీ మారుతున్నానని కావాలనే తనపై తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని ఆరోపించారు.
ఈ రోజు లేదా రేపట్లో భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటానని ప్రకటించారు. తనకు ఫోన్ చేసేందుకు బీజేపీ నేతలకు ధైర్యం లేదన్నారు. తన వద్దకు మాట్లాడడానికి వస్తే బీజేపీ నేతలను చెప్పుతో కొడతానని తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు తుల ఉమ.