Kolkata: బెంగాల్ బంద్‌లో చెలరేగిన హింస.. బీజేపీ నేతపై కాల్పులు!

కోల్‌కతా రణరంగంగా మారింది. విద్యార్థులపై లాఠీచార్జ్‌కు నిరసనగా బీజేపీ బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ బంద్‌కు నిరసనగా టీఎంసీ ర్యాలీ నిర్వహించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీజేపీ నేత ప్రియాంగు పాండే కారుపై దుండగులు కాల్పులు జరిపారు. పాండే డ్రైవర్‌కు గాయాలయ్యాయి.

Kolkata: బెంగాల్ బంద్‌లో చెలరేగిన హింస.. బీజేపీ నేతపై కాల్పులు!
New Update

Kolkata: కోల్ కతాలో జూనియర్ డాక్టర్ అభయ అత్యాచార ఘటనపై వివాదం కొనసాగుతూనే ఉంది. మంగళవారం సచివాలయ ముట్టడిలో విద్యార్దులపై లాఠీచార్జ్‌కు నిరసనగా బుధవారం బీజేపీ 12 గంటల బంద్‌కు పిలుపునిచ్చింది. దీంతో బీజేపీ బంద్‌కు నిరసనగా టీఎంసీ ర్యాలీ నిర్వహించడంతో రాష్ట్రంలో వాతావరణం రణరంగంగా మారింది. పోటాపోటీ ర్యాలీలు, బంద్‌తో పశ్చిమబెంగాల్ అంతటా రవాణా వ్యవస్థ స్తంభించింది.

పాండే కారుపై దుండగుల కాల్పులు..

ఈ క్రమంలోనే బీజేపీ నేత ప్రియాంగు పాండే కారుపై దుండగులు కాల్పులు జరిపారు. అయితే వెంటనే అప్రమత్తమైన ప్రియాంగు.. జాగ్రత్తపడటంతో తృటిలో ప్రమాదం తప్పింది. అయితే ప్రియాంగు పాండే డ్రైవర్‌కు గాయాలయ్యాయి. ఇందుకు సంబంధించిన కాల్పుల దృశ్యాలను రాష్ట్ర బీజేపీ నేతలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని భట్పారాలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు గుర్తించారు. మరో నేత ఇంటికి వెళ్తుండగా బాంబులు విసిరి, కాల్పులకు పాల్పడ్డట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలవగా.. ఇదంతా టీఎంసీ, కాంగ్రెస్ కుట్రే అని బీజేపీ ఆరోపిస్తోంది. కానీ బీజేపీ ఆరోపణలపై టీఎంసీ ఖండిస్తోంది.

#kolkata-bjp #priyangu-pandu
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe