AP: పేర్ని నాని బీ కేర్ ఫుల్.. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి వార్నింగ్..!

పేర్ని నాని నోటిని అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి. అధికారులను అడ్డం పెట్టుకొని ఎన్నికలకు పోవాలని అనుకుంటున్నారా? అని నిలదీశారు. మా నాయకురాలు పురంధేశ్వరికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

New Update
AP: పేర్ని నాని బీ కేర్ ఫుల్.. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి వార్నింగ్..!

BJP Bhanu Prakash Reddy: టీడీపీ అధినేత చంద్రబాబు కోసం పురందేశ్వరి బరితెగించి 22 మంది ఐపీఎస్ అధికారులపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మాజీ మంత్రి పేర్నినాని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాజకీయ వ్యవస్థలో ఇలాంటి బరి తెగింపు ఇప్పుడే చూస్తున్నామని నిప్పులు చెరిగారు. అయితే, ఈ వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి స్పందించారు.

Also Read: జగన్ బీజేపీకి ఓ బానిస.. అన్నను ఓడిస్తేనే అభివృద్ధి: షర్మిల సంచలనం

పేర్ని నాని నోటిని అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. అధికారులను అడ్డం పెట్టుకొని ఎన్నికలకు పోవాలని అనుకుంటున్నారా? అని నిలదీశారు. మా నాయకురాలు పురంధేశ్వరికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే బయట తిరగనివ్వమని పేర్నినాని హెచ్చరించారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు