Etela Rajender: నేను గెలిచేవాడిని కాదు..ఈటల హాట్ కామెంట్స్‌..!

సీఎం కేసీఆర్‌పై హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ నిప్పులు చెరిగారు. వడ్డెర జాతిని బీఆర్ఎస్‌ ప్రభుత్వం మోసం చేస్తుందని ఆరోపించారు . సుందరయ్య విజ్ఞానకేంద్రంలో వడ్డెర సంఘం ప్రతినిధుల సభలో పాల్గొన్నా బీజేపీ ఈటల రాజేందర్ కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఫెడరేశన్లకు డబ్బులు కేటాయించి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు.

New Update
Etela Rajender: నేను గెలిచేవాడిని కాదు..ఈటల హాట్ కామెంట్స్‌..!

Etela Rajender: వడ్డెర జాతిని కేసీఆర్ ప్రభుత్వం మోసం చేస్తుందని ఆరోపించారు హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. సుందరయ్య విజ్ఞానకేంద్రంలో వడ్డెర సంఘం ప్రతినిధుల సభలో పాల్గొన్నా బీజేపీ ఈటల.. కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. ఫెడరేశన్లకు డబ్బులు కేటాయించి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు.

వడ్డెర వర్గాలకు స్వేఛ్ఛ లేనంత వరకు దోపిడీ, అణచివేత పొనంత వరకు..నిజమైన స్వాతంత్రం రాలేదనే భావించే వ్యక్తినని తెలిపారు.  ఓటు నీ అంతరాత్మ, నీ ఆత్మగౌరవ ప్రతీక..ఓటు కొనుక్కుంటే దొరికేది కాదు..అడుక్కుంటే వచ్చేది కాదు..మనం నిర్ణయించుకుంటే మనల్ని ఎవరు కొనలేడని..అలా జరిగి ఉంటే హుజురాబాద్ లో నేను గెలిచేవాన్ని కాదని వడ్డెర సంఘం ప్రతినిధులకు తెలిపారు.

52 ఏళ్ల చరిత్రలో ఒక్కరన్న మన జాతుల నుండి ముఖ్యమంత్రి అయ్యారా? మనకు తెలివి లేదా ? అని వడ్డెర సంఘం ప్రతినిధులను ప్రశ్నించారు. తెలివి ఎవరి అబ్బ సొత్తు కాదని..ఇన్నాళ్లూ ఏ ఒక్కరు ముఖ్యమంత్రి పదవి వైపు కన్నెత్తి కూడా చూడలేదని.. ఇప్పుడు ఆడుక్కోవడానికి సిద్దంగా లేమని..పోరాటమే ఎజెండాని వ్యాఖ్యనించారు. రాష్ట్ర ప్రభుత్వాలు తమ జాతిని గుర్తించి ఆర్థికంగా అభివృద్ధి చెందేలా ప్రత్యేక ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. EMD లేకుండా వడ్డెరలకు కాంట్రాక్ట్లు కేటాయించాలని సూచించారు.వడ్డెరోల్లను చూస్తే ఎండ కూడా పారిపోతుందని నానుడి ఉండేదని చెప్పారు. వడ్డెరలను ఎస్టీ జాబితాలో చేర్చాలనే డిమాండ్ ఉందని గుర్తు చేశారు.

బీజేపీ అధికారంలోకి వస్తే వడ్డెర జాతికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అణగారిన వర్గాలకు అధికారం ఇవ్వాలని అంబేద్కర్  చెప్పిన స్పూర్తితో పని చేద్దామని పిలుపునిచ్చారు. హక్కులు అడుక్కుంటే రావని.. పొరాడితేనే వస్తాయని అన్నారు. సకల సమస్యలకు పరిష్కారం రాజ్యాధికారం అని చెప్పారు. సీఎం కేసీఆర్ పాలనలో కల్వకుంట్ల ఫ్యామిలీ తప్ప ఏ వర్గం ప్రజలు బాగుపడలేదని అన్నారు. పేద ఆడపిల్లలను చెరిచినా కూడా ఈ యంత్రాంగం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు.

Advertisment
తాజా కథనాలు