Telangana BJP MLA List: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ విడుదలైంది. తొలి విడతగా 52 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది బీజేపీ. ఎమ్మెల్యే అభ్యర్థుల వివరాలను ఆ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ విడుదల చేసింది. సెకండ్ లిస్ట్‌ను కూడా త్వరలోనే విడుదల చేస్తామని పార్టీ నేతలు చెబుతున్నారు. పార్టీ అభ్యర్థులను ఎంపిక చేసేందుకు పెద్ద ఎత్తున కసరత్తు చేసింది బీజేపీ అధిష్టానం. వరుస సమావేశాలు నిర్వహించింది కేంద్ర ఎన్నికల కమిటీ. శనివారం జరిగిన సమావేశంలో ఫస్ట్ లిస్ట్‌ను ఫైనల్ చేసింది. వాస్తవానికి శనివారమే ఈ లిస్ట్ విడుదల అవుతుందని అనుకున్నప్పటికీ.. పలు కారణాల చేత పార్టీ ఈ లిస్ట్‌ను రిలీజ్ చేయలేదు. ఇవాళ లిస్ట్ విడుదల కావడంతో సీట్ కన్ఫామ్ అయిన అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఈ ఫస్ట్ లిస్ట్‌లో పార్టీకి చెందిన ప్రధాన అభ్యర్థులు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, రాణి రుద్రమ, బండి సంజయ్ కుమార్, సోయం బాపూరావు, అరవింద్ పేర్లు కూడా ఉన్నాయి. అయితే, ముగ్గురు ఎంపీల ఎమ్మెల్యేలుగా పోటీ చేయనుండగా.. ఈటెల రాజేందర్ ఎమ్మెల్యేగా రెండు చోట్ల నుంచి పోటీకి దిగనున్నారు. ఒకటి తన నియోజకవర్గమైన హుజురాబాద్ నుంచి.. మరొకటి సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్ నియోజకవర్గం నుంచి బరిలో నిలుస్తున్నారు.
సీఎంపై ఈటల పోటీ..
మొదటి నుంచి ఈటల రాజేందర్ ప్రకటిస్తున్నట్లుగానే.. సీఎం కేసీఆర్ పై గజ్వేల్ నుంచి పోటీ చేస్తున్నారు. పార్టీ కూడా ఆయన పేరును ప్రకటించడంతో సీఎంపై పోటీకి గ్రీన్ సిగ్నల్ లభించినట్లయ్యింది. ఇక సీఎం కేసీఆర్ పోటీ చేయనున్న మరో స్థానం కామారెడ్డి నుంచి వెంకట రమణను పోటీకి దించుతోంది బీజేపీ. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైనా పోటీ చేసేందుకు అభ్యర్థిని ప్రకటించింది బీజేపీ. మంత్రి కేటీఆర్ పోటీ చేస్తున్న సిరిసిల్ల నుంచి బీజేపీ అభ్యర్థి రాణిరుద్రమ పోటీ చేయనున్నారు.
సీటు కన్ఫామ్ అయిన ప్రధాన నేతలు..
కరీంనగర్ ఎమ్మెల్యేగా ఎంపీ బండి సంజయ్ పోటీకి దిగనున్నారు. కోరుట్ల నుంచి ఎంపీ ధర్మపురి అరవింద్, బోథ్ నుంచి ఎంపీ సోయం బాపూరావు పోటీ చేస్తున్నారు. ఇక ఎమ్మెల్యే రఘునందన్ రావుకు దుబ్బాక కన్ఫామ్ అయ్యింది.
బీజేపీ ఫస్ట్ లిస్ట్ పై ఆర్టీవీ విశ్లేషణ.. లైవ్ వీక్షించండి..
Also Read:
Batukamma:గౌరమ్మను తల్లి గంగమ్మ ఒడిలో వదిలేసే సద్దుల బతుకమ్మ
Women Health: మహిళలూ బీ అలర్ట్.. ఈ 7 లక్షణాలు అస్సలు విస్మరించొద్దు..