/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/BJP-CEC-Meeting-jpg.webp)
Telangana BJP Candidates: తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీ(BJP) స్పీడ్ పెంచింది. పార్టీ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరిగింది. ఐదు రాష్ట్రాల ఎన్నికలకు అభ్యర్థులను ఎంపిక చేసింది. అయితే, బీజేపీ అధిష్టానం ప్రధానంగా తెలంగాణపైనే ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణ బీజేపీ లిస్ట్ దాదాపు ఫైనల్ అయినట్లు సమాచారం అందుతోంది. త్వరలోనే బీజేపీ తమ అభ్యర్థులకు సంబంధించిన ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేయనుంది. ఐదు రాష్ట్రాల్లోని సీట్లను ఏ, బీ, సీ, డీగా వర్గీకరించింది బీజేపీ. కాగా, తెలంగాణలో అధికార బీజేపీ ఇప్పటికే 115 మంది పేర్లతో తొలి విడత అభ్యర్థులను ప్రకటించింది. మరో నాలుగు స్థానాలకు పెండింగ్ ఉండగా.. ఆ అభ్యర్థులు కూడా ఖరారయ్యారు. ఇక కాంగ్రెస్ కూడా అభ్యర్థుల ఎంపిక స్పీడ్‌గా వర్క్ చేస్తోంది. అభ్యర్థుల ఎంపికలో భాగంగా లిస్ట్‌ను పార్టీ హైకమాండ్‌కు పంపింది. త్వరలోనే ఈ లిస్ట్ విడుదల చేయనుంది కాంగ్రెస్ పార్టీ.
మొత్తానికి తెలంగాణలో ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. ఓవైపు బీఆర్‌ఎస్ ఇప్పటికే తమ అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల కదనరంగంలో దూసుకుపోతుంటే.. మేము సైతం అంటూ బీజేపీ, కాంగ్రెస్ దూసుకొస్తున్నారు. అభ్యర్థుల ఎంపికలో స్పీడ్‌ను పెంచాయి. బీఆర్ఎస్‌లో టిక్కెట్ ఆశించి, లభించని నేతలు బీజేపీ, కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. మరి బీజేపీలో టిక్కెట్ దక్కక పార్టీని వీడే వారు ఎంత మంది ఉంటారో చూడాలి.
Also Read: