Telangana Elections 2023: తెలంగాణ ఎన్నికలు వాయిదా?

తెలంగాణలో ఎన్నికలు వాయిదా వేయాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ ఫిర్యాదు చేసింది. ఓటర్ జాబితాలో ఎన్నో అక్రమాలు ఉన్నాయంటూ ఆపార్టీ నేత మర్రి శశిధర్ రెడ్డి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఓటర్ జాబితాలో లెక్కలేనన్ని అక్రమాలు ఉన్నాయని..వాటిని సరిచేసేందుకు గడువును పొడిగించాలని ఈసీని కోరారు. జనవరి 16వ తేదీ వరకు తెలంగాణ అసెంబ్లీ గడువు ఉందని..అందుకే ఎన్నికల నిర్వహణను డిసెంబర్ కు వాయిదా వేయాలని కోరారు.

New Update
Telangana Elections 2023: తెలంగాణ ఎన్నికలు వాయిదా?

తెలంగాణలో ఎన్నికల హడావుడి షురూ అయ్యింది. త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు రానుండటంతో..కసరత్తు మొదలుపెట్టింది ఈసీ. ఈ నేపథ్యంలో తెలంగాణలో మూడు రోజులపాటు సమావేశాలు నిర్వహిస్తోంది. ఇప్పటికే హైదరాబాద్ లోని తాజ్ క్రుష్ణ హోటల్ ఈసీఐ చేరుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఎన్నికలు వాయిదా వేయాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ ఫిర్యాదు చేసింది. ఓటర్ జాబితాలో ఎన్నో అక్రమాలు ఉన్నాయంటూ ఆపార్టీ నేత మర్రి శశిధర్ రెడ్డి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఓటర్ జాబితాలో లెక్కలేనన్ని అక్రమాలు ఉన్నాయని..వాటిని సరిచేసేందుకు గడువును పొడిగించాలని ఈసీని కోరారు. జనవరి 16వ తేదీ వరకు తెలంగాణ అసెంబ్లీ గడువు ఉందని..అందుకే ఎన్నికల నిర్వహణను డిసెంబర్ కు వాయిదా వేయాలని కోరారు.

Advertisment
తాజా కథనాలు