Daggubati Purandeswari: చంద్రబాబు అరెస్ట్‌పై పురంధేశ్వరి సంచలన ప్రెస్‌మీట్.. జగన్ టార్గెట్‌గా..

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్ట్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటు పురంధేశ్వరి తొలిసారి స్పందించారు. సీఎం జగన్ లక్ష్యంగా సంచలన ప్రెస్ మీట్ పెట్టారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతికి కర్త కర్మ క్రియ అధికార పార్టీనే అని సంచలన ఆరోపణలు చేశారు.

New Update
Daggubati Purandeswari: చంద్రబాబు అరెస్ట్‌పై పురంధేశ్వరి సంచలన ప్రెస్‌మీట్.. జగన్ టార్గెట్‌గా..

Daggubati Purandeswari Reacts on Chandrababu Arrest: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్ట్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటు పురంధేశ్వరి తొలిసారి స్పందించారు. సీఎం జగన్ లక్ష్యంగా సంచలన ప్రెస్ మీట్ పెట్టారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతికి కర్త కర్మ క్రియ అధికార పార్టీనే అని సంచలన ఆరోపణలు చేశారు. స్కీల్ డెవలప్మెంట్ కేసులో అవినీతి ఎక్కడ ఉంది? అని ప్రశ్నించారు. గుంటూరు, విజయవాడల్లో ఉన్న 100 సెంటర్లు తిరిగిందా? అని ఎద్దేవా చేశారు. ఇదే అంశంపై శనివారం ప్రెస్‌మీట్ పెట్టి పురంధేశ్వరి.. స్కిల్ డెవలప్‌మెంట్ ఏర్పాట్లపై ప్రకాశం జిల్లాలో వాకలు చేశానని అన్నారు. చాలా సెంటర్లలో 100 కంప్యూటర్లు ఇచ్చారని తెలిసిందన్నారు. మరి సీఐడీ ఆయా సెంటర్లు వెళ్లిందా? అని ప్రశ్నించారు పురంధేశ్వరి.

పురంధేశ్వరి సంచలన ప్రెస్ మీట్..

ఎన్టీఆర్ కూతురుగా చాలా ముఖ్యమైన అంశాలు నేర్చుకున్నానని అన్నారు పురంధేశ్వరి.. సీఎం అయ్యాక కూడా ఎన్టీఆర్ ఫియట్ కారులో వెళ్లారని నాటి రోజులను గుర్తు చేశారు. అవినీతి ఏ స్థాయిలో ఉన్నా వ్యతిరేకించాలన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి అంతటికీ.. కర్త కర్మ క్రియ అధికార పార్టీనే అని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇదే సమయంలో మద్యపానం నిషేధంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. జగన్‌ను టార్గెట్ చేస్తూ.. మద్యపాన నిషేధంపై ప్రశ్నల వర్షం కురిపించారు. మద్యపాన నిషేధంపై ఒక మహిళ ప్రశ్నించగా.. మద్యాన్ని 5 స్టార్ హోటల్స్‌కు పరిమితం చేస్తానని సీఎం జగన్ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు పురంధేశ్వరి. ఆ తరువాతే 2024 ఎన్నికలకు ఓట్లు అడుగుతానని జగన్ చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు. కానీ, ప్రస్తుతం పరిస్థితి ఆ మాటలకు భిన్నంగా ఉందన్నారు. గ్రామాల్లో వాటర్ ప్లాంట్ లేదు కానీ, మద్యం ఏరులై పారుతోందన్నారు. సూర్యుడైనా లేటుగా ఉదయిస్తాడు కానీ, మద్యం ఉదయాన్నే దొరుకుతోందని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు దగ్గుపాటి పురంధేశ్వరి.

Also Read:

PM Modi: సంచలన నిర్ణయాలు తీసుకోబోతున్నాం.. ప్రధాని మోదీ కీలక ప్రకటన..

ఈనెలలోనే టీడీపీ, జనసేన సమన్వయకమిటీ సమావేశం

Advertisment
Advertisment
తాజా కథనాలు