Ponguleti Srinivasa Reddy: గతంలో మేఘా ఇంజనీరింగ్ కంపెనీ బ్యాంక్ గ్యారెంటీ మోసాలను RTV వెలుగులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఇదే అంశంపై సంచలన ఆరోపణలు చేశారు బీజేఎల్ఫీ నేత మహేశ్వర్ రెడ్డి. మేఘా సంస్థతో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కూడా నకిలీ గ్యారెంటీలతో అవినీతికి పాల్పడుతున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. పొంగులేటి దేశంలోనే అతిపెద్ద కుంభకోణానికి పాల్పడ్డారని ఏలేటి అన్నారు. కేవలం 8 కోట్లు మార్కెట్ క్యాప్ మాత్రమే ఉన్న యూరో యాక్సిన్ బ్యాంక్ నుంచి వందల కోట్ల రూపాయల బ్యాంక్ గ్యారేజీలు ఎలా తీసుకున్నారు అని ఆయన ప్రశ్నించారు. మేఘా ఇంజనీరింగ్ కంపెనీతో పాటు మంత్రి పొంగులేటి కూడా ఇదేవిధమైన మోసానికి తెరలేపారు. అతి చిన్న బ్యాంక్ వందల కోట్ల గ్యారెంటీలను రాఘవ కన్‌స్ట్రక్షన్ కంపెనీ వర్క్స్ కోసం ఉపయోగించడం పొంగులేటి చేసిన పెద్ద అవినీతి.. మోసం అంటూ మహేశ్వర్ రెడ్డి తీవ్రంగా విరుచుకుపడ్డారు. యూరో యాక్సిన్ బ్యాంకు గ్యారెంటీలు ఇచ్చిన మేఘా, నవయుగ, రాఘవ కన్‌స్ట్రక్షన్ కంపెనీలపై కేంద్రానికి ఫిర్యాదు చేయనున్నట్టు ఆయన వెల్లడించారు. ఈ అవినీతిలో ప్రమేయం ఉన్న కంపెనీలన్నిటిపై సీబీఐతో విచారణ జరిపించాలని మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. మహేశ్వర్ రెడ్డి RTVకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కుంభకోణంపై ఏమన్నారో వివరంగా మీరు కూడా ఈ కింది వీడియో చూసి తెలుసుకోవచ్చు.
అసలు ఏమిటీ ఈ బ్యాంక్ గ్యారెంటీ మోసం?
onguleti Srinivasa Reddy: ఇండియాలో ప్రాజెక్టులకు పక్కదేశంలో ఉన్న బ్యాంక్ గ్యారంటీలు ఇవ్వడమేంటి? అది కూడా బ్యాంక్ కానీ బ్యాంక్.. దొంగ బ్యాంక్ గ్యారంటీలు ఇవ్వడమేంటి? యూరో ఎగ్జిమ్ బ్యాంక్ ఉన్న సెయింట్ లూసియా జనాభా 2 లక్షలు మాత్రమే. ఈ బ్యాంక్ నికర విలువ 8 కోట్లు మాత్రమే. ఇలాంటి డమ్మీ బ్యాంక్ ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే 31 ప్రాజెక్టులకు సంబంధించి దాదాపు 481 కోట్ల గ్యారెంటీలు ఇచ్చింది. సెయింట్ లూసియాలో ఉండే యూరో ఎగ్జిమ్ బ్యాంక్ అనే ఓ చిన్న ఫినాన్షియల్ కంపెనీ ఇండియాలో లక్షల కోట్ల మోసాలకు కారణమవుతోంది. అటు ప్రత్యక్షంగానూ, ఇటు పరోక్షంగానూ దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే విధంగా ఆ కంపెనీ కార్యకలాపాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. మేఘా ఇంజనీరింగ్ కంపెనీ ఈ బ్యాంక్ గ్యారెంటీలతోనే తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రాజెక్టుల కాంట్రాక్టులు చేపట్టింది.
Ponguleti Srinivasa Reddy: ఏపీ విద్యుత్ శాఖలో విజయానంద్, సంతోష్ రావు, పద్మా జనార్ధన్ రెడ్డి, ఈ ఫేక్ బ్యాంక్ గ్యారంటీలకు ఆమోద ముద్ర వేశారు. ఆంధ్రాలో ఫేక్ బ్యాంక్ గ్యారెంటీలు సమర్పించిన వారిలో తెలంగాణ మంత్రి పొంగులేటి, ప్రతిమ శ్రీనివాసరావు కంపెనీలు కూడా ఉన్నాయని ఆర్టీవీ ఇన్‌వెస్టిగేషన్‌లో తేలింది. ఆంధ్రప్రదేశ్ మైన్స్ అండ్ జియాలజీ విభాగం కూడా ఈ దొంగ బ్యాంక్ గ్యారంటీలను ఆమోదించింది. అటు కర్ణాటక డిస్కంలు కూడా ఈ నకిలీ బ్యాంక్ గ్యారెంటీలకు స్వాగతం పలికాయి. మరోవైపు మహారాష్ట్రలో MMRDA లాంటి ప్రభుత్వ సంస్థలు భారీ ప్రాజెక్టులకు ఈ దొంగ బ్యాంక్ గ్యారెంటీల ద్వారా కుంభకోణానికి లైన్ క్లీయర్ చేశాయి.
ఈ విషయాన్ని RTV బయటపెట్టింది. ఇప్పుడు ఇదే అంశంపై మహేశ్వర్ రెడ్డి దీనిలో మంత్రి పొంగులేటి కూడా ఉన్నారని స్పష్టం చేస్తున్నారు. దీనిపై సీబీఐ విచారణ ఆయన డిమాండ్ చేస్తూ కేంద్రానికి ఫిర్యాదు చేస్తున్నట్టు చెప్పారు.
అసలు బ్యాంక్ గ్యారంటీ అంటే ఏంటి?
బ్యాంక్ గ్యారంటీ అంటే కాంట్రాక్టరు షూరిటీగా సమర్పించేది. సాధారణంగా ప్రాజెక్టుకు అయ్యే ఖర్చులో 10 శాతం మొత్తానికి బ్యాంకు గ్యారంటీ ఇస్తుంది. యూరో ఎగ్జిమ్ బ్యాంక్ చేసేది ఇదే. ఇక్కడ వరకు బాగానే ఉన్నా అసలు మేటర్ వేరే ఉంది. RBI గుర్తించిన బ్యాంకుల జాబితాలో కూడా లేని యూరో ఎగ్జిమ్ బ్యాంక్ గ్యారంటీలను ప్రభుత్వాలు ఎలా అంగీకరిస్తున్నాయన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. మరోవైపు ఈ దొంగ బ్యాంక్ హెడ్ ఆఫీసు సెయింట్ లూసియాలో ఉంది కానీ ఈ కంపెనీ ఏర్పడింది మాత్రం ఇంగ్లండ్ అండ్ వేల్స్ చట్టాల ప్రకారం. ఇలా ఇండియాకు ఏ మాత్రం సంబంధం లేని ఓ చిన్న ఫినాన్షియల్ కంపెనీ భారత్‌లో లక్షల కోట్ల ప్రాజెక్టులకు గ్యారంటీ ఇస్తుండడం విడ్డూరం అనే చెప్పాలి.