పొంగులేటి తెలంగాణ డీకే శివకుమార్.. బీజేఎల్పీ నేత ఏలేటి సంచలన వ్యాఖ్యలు! మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలంగాణ డీకే శివకుమార్ అంటూ బీజేఎల్పీ నేత మహేశ్వరరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పొంగులేటికి కొడంగల్-నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ కాంట్రాక్టు పనులు రావడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాత్ర ప్రభుత్వంలో నామమాత్రమేనన్నారు. By Nikhil 20 Aug 2024 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి తెలంగాణ బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలంగాణలో డీ.కే.శివకుమార్ పాత్ర పోషిస్తున్నాడని బాంబు పేల్చారు. పొంగులేటి ఢిల్లీలో కదిపే పావులు చూస్తుంటే ఆయన ఇంకేదో పదవి ఆశిస్తున్నారని అర్థమవుతోందన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని కాదని కొడంగల్ - నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ సగం కాంట్రాక్టు పనులు పొంగులేటికి వచ్చాయన్నారు. భట్టి విక్రమార్కకు డిప్యూటీ సీఎం పదవి నామ మాత్రమేనన్నారు. ఆయన ప్రభుత్వంలో సెకండ్ ప్లేసులో ఆయన లేరన్నారు. పొంగులేటి తన వెంట ఎమ్మెల్యేలు ఉన్నారని భయపెడుతున్నాడా? అని ప్రశ్నించారు. హైకమాండ్‌కు కప్పం కడుతున్నందుకు బహుమతిగా పొంగులేటికి కాంట్రాక్టులు ఏమైనా ఇస్తున్నారా? అంటూ అనుమానం వ్యక్తం చేశారు మహేశ్వరరెడ్డి. బీజేఎల్పీ నేతగా ఎన్నికైన నాటి నుంచి మహేశ్వరరెడ్డి ప్రభుత్వంపై తనదైన శైలిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఆర్ ట్యాక్స్, బీ ట్యాక్స్ అంటూ ఆరోపణలు చేసి తెలంగాణ పాలిటిక్స్ లో ఆయన కొత్త చర్చకు తెరలేపారు. మేఘా సంస్థ అవినీతిపై సైతం అనేక సార్లు ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వం కోరితే కేంద్రంతో మాట్లాడి ఆ సంస్థపై సీబీఐ విచారణ జరిపించేలా చొరవ తీసుకుంటానన్నారు మహేశ్వరరెడ్డి. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి