రంగనాథ్ హైడ్రా కమిషనరా? లేక పొలిటికల్ లీడరా? అని బీజేఎల్పీ నేత మహేశ్వరరెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. కమిషనర్ కు సోకు ఉంటే ఖాకీ బట్టలు వదిలేసి ఖద్దరు బట్టలు వేసుకోవాలన్నారు. కేవలం హిందువుల నిర్మాణాలను మాత్రమే కూల్చడమే పనిగా పెట్టుకున్నారా? అని హైడ్రాను ప్రశ్నించారు. ఈ రోజు ఆయన మాట్లాడుతూ.. హైడ్రా కమిషనర్ రంగనాథ్.. ఐపీఎస్ అధికారిగా తనకు తాను మీడియా ముందు బిల్డప్ చేసుకుంటున్నాడని ధ్వజమెత్తారు. హైడ్రా పేరుతో పెద్ద ఎత్తున వసూళ్లు నడుస్తున్నాయని వార్తలు వస్తున్నాయన్నారు.
పూర్తిగా చదవండి..ఖాకీ బట్టలు విప్పి.. ఖద్దరు వేసుకో: హైడ్రా కమిషనర్ పై బీజేఎల్పీ నేత సంచలన కామెంట్స్
హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు సోకు ఉంటే ఖాకీ బట్టలు విప్పి ఖద్దరు వేసుకోవాలని బీజేఎల్పీ నేత మహేశ్వరరెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. ఐపీఎస్ అధికారిగా తనకు తాను మీడియా ముందు బిల్డప్ చేసుకోవద్దని సూచించారు. ఓవైసీ కోసమే ఓల్డ్ సిటీలోకి హైడ్రా వెళ్లడం లేదన్నారు.
Translate this News: