Euro Exim Bank నుంచి పొంగులేటి ఫేక్ గ్యారెంటీలు.. మహేశ్వర్ రెడ్డి సంచలన ఆరోపణలు

యూరో ఎగ్జిమ్ బ్యాంక్ నుంచి ఫేక్ గ్యారెంటీలతో ప్రాజెక్టులు చేస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కేబినెట్ నుంచి తొలగించాలని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. దేశంలోనే ఇదో తీవ్ర ఆర్థిక నేరం, కుంభకోణం అని ఫైర్ అయ్యారు.

Euro Exim Bank నుంచి పొంగులేటి ఫేక్ గ్యారెంటీలు.. మహేశ్వర్ రెడ్డి సంచలన ఆరోపణలు
New Update

తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. యూరో ఎగ్జిమ్ బ్యాంక్ బ్యాంక్ కుంభకోణంలో పొంగులేటి ఉన్నారని ఆరోపించారు. సోమవారం అసెంబ్లీ మీడియా హాల్ లో మహేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. అసలు భారతదేశానికి సంబంధం లేని, ఆర్బీఐ అనుమతి లేని యూరో ఎగ్జిమ్ బ్యాంక్ అనే ఫైనాన్స్ కంపెనీ నుంచి పొంగులేటి ఫేక్ బ్యాంక్ గ్యారెంటీలను పొందాడని ఆరోపించారు. పొంగులేటికి చెందిన రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌ సంస్థ ఫేక్ బ్యాంకు గ్యారంటీలతో వందల కోట్ల కాంట్రాక్టు పనులు దక్కించుకుందన్నారు.

సెయింట్ లూసియాలో ఉండే కేవలం రూ.8 కోట్ల విలువైన ఓ ఫైనాన్స్ కంపెనీ.. మన రాష్ట్రంలో వేల కోట్ల ప్రాజెక్టులకు గ్యారెంటీలు ఇవ్వడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆ గ్యారెంటీలకు ఓకే చెప్పి రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీలు కాంట్రాక్టులు మంజూరు చేయడంపై ఫైర్ అయ్యారు. ఈ కుంభకోణంలో భాగస్వామిగా ఉన్న పొంగులేటికి మంత్రివర్గంలో కొనసాగే అర్హత లేదన్నారు. ఇదో తీవ్ర ఆర్థిక నేరం, కుంభకోణంగా ఆయన అభివర్ణించారు.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి