Bird Flu: ఆవుపాలలో బర్డ్ ఫ్లూ అవశేషాలు!

అమెరికాలోని (FDA) సంస్థ సంచలన రిపోర్ట్‌ వెలువరించింది. అమెరికా వ్యాప్తంగా సరఫరా అవుతున్న ఆవు పాలల్లో బర్డ్‌ఫ్లూని గుర్తించినట్టు FDA అధికారులు ఇచ్చిన రిపోర్ట్ సంచలనమవుతోంది. అదేంటో చూసేయండి!

Milk Price : లీటర్‌ పాల ధర రూ.370... ఎక్కడంటే!
New Update

Bird Flu Virus in Cow Milk: అమెరికాలోని  Food and Drug Administration (FDA) సంస్థ సంచలన రిపోర్ట్‌ వెలువరించింది. అమెరికావ్యాప్తంగా సరఫరా అవుతున్న పాశ్చురైజ్డ్‌ పాలలో బర్డ్ ఫ్లూ అవశేషాలు (Bird Flu in Milk) కనిపించాయని వెల్లడించింది. కొన్ని శాంపిల్స్‌ని టెస్ట్ చేలి అందులో బర్డ్‌ ఫ్లూ ని గుర్తించినట్టు స్పష్టం చేసింది. అయితే...ఆ పాలు తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రమాదం లేదని,ఈ టెస్ట్‌లకు సంబంధించిన పూర్తి ఫలితాలు ఇంకా రావాల్సి ఉందని తెలిపింది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లోని ఆవుల్లో H5N1 స్ట్రెయిన్ బర్డ్‌ఫ్లూ గుర్తించారు వైద్యులు. ఇలా ఆవుల్లో ఈ వైరస్ ఆనవాళ్లు ఉండడం ఇదే తొలిసారి. ఇప్పటి వరకూ కనీసం 8 రాష్ట్రాల్లో బర్డ్‌ఫ్లూ వైరస్ ఆందోళన కలిగిస్తోంది. వీలైనంత వేగంగా ఈ ఫ్లూని కట్టడి చేసేందుకు  Centres for Disease Control and Prevention చర్యలు చేపడుతోంది. అయితే...బర్డ్‌ ఫ్లూ అవశేషాలు కేవలం పాశ్చురైజ్డ్‌ పాలల్లో (Pasteurized Milk) మాత్రమే కనిపించాయని వివరణ ఇచ్చింది. ఈ పాలను టెస్ట్ చేసేందుకు PCR విధానాన్ని అనుసరించినట్టు వెల్లడించింది. అందులో పాజిటివ్ వచ్చినంత మాత్రాన ఇంకా ఆ పాలల్లో వైరస్‌ యాక్టివ్‌గా ఉందనుకోడానికి వీల్లేదని, పూర్తి ఫలితాలు వచ్చిన తరవాతే ఓ నిర్ణయానికి రాగలమని స్పష్టం చేసింది. 

Also Read: గన్ మిస్‌ఫైర్.. జవాన్ ఛాతిలోకి దూసుకెళ్లిన బుల్లెట్

"ప్రస్తుతానికి కొన్ని చోట్ల పాశ్చురైజ్ చేసిన పాలల్లో ఈ ఫ్లూ కనిపించింది. అయితే...పాశ్చురైజేషన్ చేయడం వల్ల వైరస్ యాక్టివ్‌గా ఉండే అవకాశాలు తక్కువ. అలా అని పూర్తిగా ఫ్లూ లేకుండా పోతుందని అనుకోడానిక వీల్లేదు. ఏదేమైనా కేవలం ఈ పాలల్లో మాత్రమే ఫ్లూని గుర్తించాం. ప్రజలకు సరఫరా అవుతున్న పాలతో మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదు. అందులో ఫ్లూ ఏమీ లేదు. రకరకాల స్టడీలు చేసిన తరవాతే మరి కొద్ది వారాల్లో పూర్తి స్థాయి రిపోర్ట్‌ అందిస్తామని FDA అధికారులు తెలిపారు.

#bird-flu #cow-milk
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe