Common Man Died in Bike Racing: ఒక్కోసారి ఒళ్ళుజలదరించే వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తాయి. వాటిని చూస్తే అయ్య బాబోయ్ అనిపిస్తుంది. తరువాత ఆ వీడియో వివరాలు పూర్తిగా తెలిస్తే.. అందులో బాధితుల మీద జాలి.. ఆ సంఘటనకు కారకులైనవారిని చూసి పీక నులిమి చంపేయాలన్నంత కోపం వస్తుంది. ఇప్పుడు మీకో వీడియో ఇక్కడ చూపిస్తున్నాం చూడండి..
This browser does not support the video element.
చూశారు కదా.. ఏమనిపిస్తోంది? అయ్యో.. కుర్రకారు.. అనిపిస్తోంది కదా. బైక్ రైడింగ్(Bike Racing) తో ప్రాణాలు తీసుకుంటున్నారు అని బాధ కలుగుతుంది కదా. ఈ వీడియో ఈ మధ్య కాలంలో వాట్సాప్ గ్రూపుల్లో విపరీతంగా ట్రెండింగ్ అవుతూ.. షేర్ అవుతోంది. ఈ వీడియో షేర్ చేసిన వారంతా.. ‘’ఇంతటి మెరుపు వేగం ఎందుకు? నేటి తరం యువత వారి జీవితాన్ని ఎలా అంధకారం, నిర్వీర్యుడై పోతున్న యువత...!? మీ పిల్లలు ఏమి చేస్తున్నారో గమనిస్తూ ఉండాలి. స్పోర్ట్స్ బైక్.. రైడింగ్ అవసరమా? భారతీయ రోడ్డు పై సాధ్యమా? ఆలోచన చేయండి. యువతను గమనిస్తూ ఉండండి’’ ఇలాంటి కామెంట్స్ తో ఈ వీడియోను షేర్ చేస్తున్నారు.
ముందు ఈ వీడియో చూసి మేమూ అలానే అనుకున్నాం. మన దేశంలో రోడ్లపైన ఇలాంటి ఫీట్స్(Bike Racing) ఏమిటి? అని. కానీ, ఈ వీడియో ఎక్కడిదో తెలుసుకోవడం కోసం గూగుల్ లో రీసెర్చ్ చేశాం. అప్పుడు తెలిసింది ఈ వీడియో మన దేశంలోనిది కాదని. ఇండోనేషియా (Indonesia) దేశంలో జరిగిన ఘటన అని. సరే వీడియో ఏ దేశానికి చెందినది అయినా.. మన కుర్రకారు కూడా తప్పకుండ ఈ వీడియో గురించి తెలుసుకోవాల్సిందే అనిపించింది అందుకే ఈ కథనం.
ఇండోనేషియాలో ఒక వ్యక్తి తన విధులు ముగించుకుని రాత్రి సమయంలో ఇంటికి వెళుతున్నాడు. అదే సమయంలో ఆ రోడ్డుపై కొంతమంది కుర్రాళ్ళు బైక్ రేస్ చేస్తున్నారు. ఇంటికి వెళుతున్న వ్యక్తి మామూలు స్పీడులోనే వెళుతున్నాడు. ఈలోపు బైక్ రేస్ చేస్తూ వస్తున్న కుర్రాడు ఒకడు రాంగ్ సైడ్ లో అత్యంత వేగంగా వచ్చి ఆ వ్యక్తి బైక్ ని నేరుగా ఢీ కొట్టాడు. దీంతో బైక్ మీద నుంచి ఆ వ్యక్తి ఎగిరిపడి దాదాపు 100 మీటర్ల దూరం రోడ్డుమీద జారుకుంటూ పక్కనే ఉన్న రైలింగ్ కి గుద్దుకుని తలపగిలి అక్కడికక్కడే మరణించాడు. ఇదీ మీరు చూసిన ఈ వీడియో.
Also Read: ఎరక్కపోయి.. ఇరుక్కుపోయిన చిరుత.. ఎలా రక్షించారంటే..
చూశారా.. ఒళ్ళు కొవ్వెక్కి బైక్ పందేలు వేసుకున్న వారి వలన ఓ అమాయక ప్రాణం ఎలా పోయిందో. అంతా చేసి ఇది కేవలం 15 సెకన్ల వీడియో. కానీ చూస్తుంటే ఒళ్ళు జలదరిస్తుంది. చనిపోయిన వ్యక్తిని చూస్తే జాలేస్తుంది. మనదేశంలోనూ ఇలా ఓవర్ స్పీడ్ తో దూసుకుపోయే కుర్రాళ్ళు.. ఆ సరదా ఎక్కువగా ఉన్న యువత చాలామంది ఉన్నారు. వారికి ఇటువంటి వీడియో చూస్తేనైనా కాస్త తగ్గుతారనిపిస్తుంది.
ఇక్కడ రెండు అంశాలు మనం చెప్పుకోవాలి. ఒకటి.. బైక్ రేసులతో వేగంగా వెళ్లడం వల్ల అనుకోని ప్రమాదం జరిగితే వారి తల్లిదండ్రుల బాధ ఎలా ఉంటుంది? ఒకవేళ వీడియోలో చూసినట్టు వేరేవారి ప్రాణం పొతే అప్పుడు పరిస్థితి ఏమిటి. పోయిన ప్రాణంతో పాటు దానికి కారణమైన వారి జీవితం కూడా జైలులో శిధిలం అయిపోతుంది కదా. అందుకే ఓవర్ స్పీడ్ వద్దు.. అంతేకాదు రోడ్డుపై డ్రైవ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
ఇక్కడ ఆ వీడియో ఒరిజినల్ లింక్ ఉంది మీరూ చూసేయండి..