Bigg Boss : బిగ్ బాస్ తమిళ్ లేటెస్ట్ సీజన్ కు హోస్ట్ ఫైనల్.. కమల్ ప్లేస్ లో ఆ స్టార్ హీరో?

తమిళ్ బిగ్ బాస్ లేటెస్ట్ సీజన్ కు హోస్ట్ గా కమల్ హాసన్ తప్పుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన ప్లేస్ లో కోలీవుడ్ స్టార్ శింబు ఈ షోను హోస్ట్ చేయబోతున్నారని తెలుస్తోంది. రీసెంట్ గా జరిపిన ఓ సర్వేలో కూడా ఎక్కువమంది శింబు పేరే చెప్పడం విశేషం.

Bigg Boss : బిగ్ బాస్ తమిళ్ లేటెస్ట్ సీజన్ కు హోస్ట్ ఫైనల్.. కమల్ ప్లేస్ లో ఆ స్టార్ హీరో?
New Update

BiggBoss Tamil : కోలీవుడ్ లో అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షో బిగ్ బాస్. గత కొన్ని సీజన్స్ ను హోస్ట్ చేసిన కమల్ హాసన్ లేటెస్ట్ సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరించడం లేదని ఇటీవల అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. సినిమా కమిట్‌మెంట్స్‌ కారణంగా బిగ్‌ బాస్‌ తమిళ్‌ అప్‌కమింగ్‌ సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరించలేకపోతున్నట్టు కమల్ తెలిపారు. ఇప్పటివరకు కమల్ హాసన్ హోస్ట్ గా వ్యవహరించిన ఈ షోకు తర్వాతి హోస్ట్ ఎవరు అనే చర్చ జోరుగా సాగుతోంది.

ఈ క్రమంలోనే తాజాగా వస్తున్న న్యూస్ ప్రకారం.. కోలీవుడ్ స్టార్ శింబు ఈ షోను హోస్ట్ చేయబోతున్నారని తెలుస్తోంది. శింబుకు తమిళనాట భారీ ఫాలోయింగ్ ఉంది. ఆయనకు మంచి కామెడీ టైమింగ్ కూడా ఉంది. ఈ కారణాల వల్ల శింబు బిగ్ బాస్ హోస్ట్ గా బాగా సూట్ అవుతారని అభిమానులు భావిస్తున్నారు. రీసెంట్ గా జరిపిన ఓ సర్వేలో కూడా ఎక్కువమంది ఈ హీరోకే ఓటేశారు.

Also Read : టాలీవుడ్ లో మహేష్ కు మాత్రమే సొంతమైన ఏకైక రికార్డు ఏంటో తెలుసా?

దీంతో బిగ్ బాస్ తమిళ్ లేటెస్ట్ సీజన్ ను శింబు హోస్ట్ చేస్తారనే న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది. అయితే, దీన్ని నిర్వాహకులు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. శింబు ఫ్యాన్స్ మాత్రం ఈ వార్త నిజమే అవుతుందనే ఆశతో ఎదురుచూస్తున్నారు.శింబు బిగ్ బాస్ హోస్ట్ అయితే షోకు మరింత జోష్ వస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన తనదైన స్టైల్‌లో షోను హోస్ట్ చేసి ప్రేక్షకులను అలరించడం ఖాయం.

#kollywood-actor-silambarasan-tr #biggboss-tamil
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe