Geetu Royal : డేంజరస్ వ్యాధి బారిన పడిన గీతూ రాయల్.. 40 ఏళ్ళకే చనిపోతుందట? గీతూ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతుందట. ఇది నయం అవ్వాలంటే దాదాపు రెండేళ్లు ట్రీట్మెంట్ తీసుకోవాలి. అలాగే ప్రతి రోజూ ఒక ఇంజెక్షన్ వేసుకోవాలి లేకపోతే 40 ఏళ్లకే చనిపోతావని డాక్టర్లు చెప్పడంతో.. ఆ మాటలకూ గీతూ డిప్రెషన్ కి లోనైందట. By Anil Kumar 29 Apr 2024 in సినిమా ట్రెండింగ్ New Update షేర్ చేయండి Geetu Royal Suffuring With A Desease : సోషల్ మీడియా ఇన్ఫ్లు యె న్సర్ గీతూ రాయల్ 'బిగ్ బాస్' షో ద్వారా మంచి క్రేజ్ తెచ్చుకుంది. సీజన్ 6 లో కంటెస్టెంట్ గా వెళ్లిన గీతూ ఒకానొక సమయంలో హౌజ్ లోనే టాప్ కంటెస్టెంట్ గా కొనసాగింది. రెండు వారాల పాటూ తన ఆట తీరుతో తోటి కంటెస్టెంట్స్ కి గట్టి పోటీ ఇచ్చిన ఈమె.. తన ఓవర్ కాన్ఫిడెన్స్ తో బిగ్ బాస్ రూల్స్ ని పక్కన పెట్టి తన ఇష్టమొచ్చినట్లు ఆట ఆడింది. రూల్స్ ని క్రాస్ చేసి గేమ్ ఆడొద్దని పలుమార్లు హెచ్చరించినా అదే తీరు కంటిన్యూ చేయడంతో ఆమె ఆట జనాలకు విసుగు కలిగించింది. దీంతో ఆడియన్స్ ఆమెని ఇంటికి పంపించేశారు. 9 వ వారంలో ఎలిమినేట్ అయిన గీతూ.. ఆ సమయంలో బాగా ఏడ్చింది. తనను ఎలిమినేట్ చేయొద్దని, హోస్ట్ నాగార్జునను వేడుకుంది. చివరికి నాగ్ ఆమెని నచ్చ జెప్పి హౌజ్ నుండి బయటికి పంపించేశాడు. Also Read : శృతి హాసన్ తో బ్రేకప్.. ఎట్టకేలకు నోరు విప్పిన మాజీ ప్రియుడు! ఆ తర్వాత సీజన్ 7 'బిగ్ బాస్' బజ్ హోస్ట్ గా వ్యవహరించిన గీతూ.. హౌజ్ నుండి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ ని తన ప్రశ్నలతో ఆ ఆట ఆడుకుంది. సీజన్ 7 ఫినాలే సమయంలో కొందరు ఆమె కారుపై దాడి చేయడం, కారు అద్దాలు పగలగొట్టడం తెలిసిందే కదా.. ఇదిలా ఉంటె గీతూ రాయల్ ప్రస్తుతం ఓ భయంకరమైన వ్యాధితో బాధపడుతుందట. ఆ వ్యాధి గురించి డాక్టర్లు తనకు చెప్పడంతో గీతూ ఒక్కసారిగా డిప్రెషన్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఆ వ్యాధితో బాధ పడుతున్న గీతూ రాయల్ గీతూ రాయల్ కి ఓ గాయమైందట. రోజులు గడుస్తున్నా కొద్ది అది మానకపోవడంతో హాస్పిటల్ కి వెళ్లి టెస్టులు చేయించడంతో.. ఆ టెస్టుల్లో ఆమెకి భయంకరమైన వ్యాధి ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారట. గీతూ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతుందట. ఇది నయం అవ్వాలంటే దాదాపు రెండేళ్లు ట్రీట్మెంట్ తీసుకోవాలి. అలాగే ప్రతి రోజూ ఒక ఇంజెక్షన్ వేసుకోవాలి. ఈ ఇన్ఫెక్షన్ సోకినా వారు పూర్తిగా తమ లైఫ్ స్టైల్ మార్చుకోవాలని, సరైన తిండి, నిద్ర లేకపోతే 40 ఏళ్లకే చనిపోతావని డాక్టర్లు చెప్పడంతో.. ఆ మాటలకూ గీతూ డిప్రెషన్ కి లోనైందట. ఇదే విషయాన్ని గీతూ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. #geetu-royal #bigg-boss-geetu-royal మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి