Bigg Boss Telugu Season 8 Promo Out : తెలుగులో అత్యధిక ప్రేక్షాదరణ పొందిన రియాలిటీ షోలలో 'బిగ్ బాస్' ముందు వరుసలో ఉంటుంది. ఈ షో మొదలైన తక్కువ సమయంలోనే సూపర్ సక్సెస్ అయ్యింది. విభిన్నమైన కాన్సెప్ట్స్ ప్రేక్షకులను అలరిస్తూ బుల్లితెర పై టాప్ టీఆర్పీ రేటింగ్స్ సత్తా చాటుతోంది. బుల్లితెర పై మాత్రమే కాదు సోషల్ మీడియాలోనూ బిగ్ బాస్ హవా ఒక రేంజ్ లో ఉంటుంది.
షో మొదలవగానే తమ ఫేవరేట్ కంటెస్టెంట్స్ కోసం సోషల్ మీడియాలో కామెంట్లు, పోస్టులతో రచ్చ చేస్తుంటారు ఫ్యాన్స్. ఇక ఒక సీజన్ పూర్తవగానే.. మరో సీజన్ ఎప్పుడొస్తుందా అని వెయిట్ చేస్తారు. ఇప్పటికీ బిగ్ బాస్ 7 సీజన్స్ పూర్తి చేసుకుంది. ఇక తాజాగా బిగ్‌బాస్ సీజన్ 8 కు సంబంధించిన తొలి అప్డేట్ వచ్చింది. ఈ సీజన్ లోగోను ప్రోమో రూపంలో రిలీజ్ చేశారు. గత కొన్ని సీజన్ల నుంచి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న నటుడు నాగార్జున ఈసారి కూడా హోస్ట్‌గా కనిపించనున్నారు.
ఈ అప్డేట్ ను స్వయంగా ఆయనే తన ఎక్స్ (ట్విటర్)లో పోస్ట్ పెట్టారు. 'ఇన్ఫినిటీ ఆఫ్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ కోసం సిద్ధం కండి' అని పేర్కొన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ప్రోమో నెట్టింట వైరల్ అవుతుంది. అయితే సీజన్ -8 ఎప్పుడు స్టార్ అవుతుంది? ఇందులో పాల్గొనే కంటెస్టెంట్స్ ఎవరు? అనే వాటిపై క్లారిటీ ఇవ్వనప్పటికీ.. ఆగస్టు ఎండింగ్ లో లేదా సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో సీజన్ 8 స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు టాక్ వినిపిస్తుంది.