Bigg Boss : "తగ్గేదే లేదు బిడ్డ".. బిగ్ బాస్ ఇంట్లోకి పల్లవి ప్రశాంత్ ఫాదర్..!

బిగ్ బాస్ సీజన్ 7.. ఫ్యామిలీ వీక్ ఎపిసోడ్ లో భాగంగా తాజాగా విడుదలైన ప్రోమోలో రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ ఫాదర్ బిగ్ బాస్ ఇంట్లోకి వచ్చారు. ప్రోమో చాలా ఎమోషనల్ గా కనిపించింది.

Bigg Boss : "తగ్గేదే లేదు బిడ్డ".. బిగ్ బాస్ ఇంట్లోకి పల్లవి ప్రశాంత్ ఫాదర్..!
New Update

Bigg Boss Telugu 7 Promo 1:  బిగ్ బాస్ సీజన్ 7.. నిన్నటి ఎపిసోడ్ లో ఫ్యామిలీ వీక్ లో భాగంగా అమర్ దీప్ వైఫ్ తేజశ్విని, శోభ మదర్, యావర్ బ్రదర్ బిగ్ బాస్ ఇంట్లోకి వచ్చారు. శోభ మదర్ తో యావర్ కు వాళ్ళ అమ్మ ఫొటో ను పంపి సర్ ప్రైజ్ చేశారు బిగ్ బాస్. అమ్మ ప్రేమతో నిన్నటి ఎపిసోడ్ అంతా చాలా ఎమోషనల్ గా ముగిసింది. ఇక ఈరోజు తాజాగా విడుదలైన ప్రోమోలో రైతు బిడ్డగా బిగ్ బాస్ కు వచ్చిన పల్లవి ప్రశాంత్ ఫాదర్ ఇంట్లోకి వచ్చారు.

publive-image

ప్రతి సీజన్ లా కాకుండా.. ఈ సీజన్ ఫ్యామిలీ వీక్ కొంచం స్పెషల్ గా ప్లాన్ చేశారు బిగ్ బాస్. ఇంటి సభ్యుల ఫ్యామిలీ మెంబర్స్ ను డైరెక్ట్ గా కాకుండా ఏదో ఒక సర్ ప్రైజ్ తో ఇంట్లోకి పంపుతున్నారు. ఈ రోజు ప్రోమోలో కూడా ముందుగా ప్రశాంత్ కోసం.. తన తోటలోని బంతిపూలను పంపారు.. వాటిని చూడగానే ఎమోషనల్ అయ్యాడు ప్రశాంత్. ఆ తర్వాత ప్రశాంత్ ఫాదర్ బాబు బంగారం.. అని పిలుస్తూ ఇంట్లోకి ఎంటర్ అయ్యాడు. ప్రశాంత్ ను చూడగానే .. " ఎన్ని నెలలు అయ్యింది బిడ్డ నిన్ను చూడక" అని కన్నీళ్ళు పెట్టుకున్నాడు ప్రశాంత్ ఫాదర్. వాళ్ళను చూసి ఇంటి సభ్యులు కూడా ఎమోషనల్ గా ఫీల్ అయ్యారు.

publive-image

తండ్రి బిగ్ బాస్ ఇంట్లోకి వచ్చాడనే సంతోషంలో.. తనకు ఎత్తుకొని.. మా బాపు బిగ్ బాస్ ఇంట్లోకి వచ్చాడు అని హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇక ప్రశాంత్ తండ్రి ఆనందంలో.. "తగ్గేదే లేదు బిడ్డ" అని కొడుకును చూసి మురిసిపోయాడు. ఇంటి సభ్యులందరితో మాట్లాడుతూ.. "అందరు కలిసి మెలిసి ఉండండి.. కొట్లాడకండి" అని చెప్పాడు. ఆ తర్వాత శివాజితో.. "నా కొడుకును మీ కన్న బిడ్డలా చూసుకున్నారు" అని కృతజ్ఞతలు తెలిపారు. చివరిలో ప్రశాంత్ గేమ్ మాట్లాడుతూ.. ఏది చెప్పినా ఏడవకు.. టాలెంట్ ను ఉపయోగించుకో.. బాగా ఆడని చెప్పాడు. ప్రోమో చివరిలో ఇంటి సభ్యులంతా ప్రశాంత్ ఫాదర్ తో కలిసి డాన్స్ వేస్తూ చాలా హ్యాపీగా కనిపించారు. ప్రశాంత్, వాళ్ళ ఫాదర్ ఇద్దరి మధ్య ప్రేమను చూసి ఇంటి సభ్యులంతా ఎమోషనల్ గా ఫీల్ అయ్యారు.

publive-image

Also Read: Bigg Boss 7 Telugu Promo: “అమ్మ ప్రేమ తెలియదు”.. అమ్మ కోసం ఏడ్చేసిన యావర్..!

#bigg-boss-7-telugu #bigg-boss-7 #bigg-boss-7-telugu-latest-updates #bigg-boss-7-promo
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe