Bigg Boss 7 Telugu: అర్జున్ తో పోటీకి యావర్.. ఎవరి బాల్ పడింది..?

బిగ్ బాస్ సీజన్ 7.. నిన్నటి ఎపిసోడ్ లో అర్జున్ ఎవిక్షన్ ఫ్రీ పాస్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈరోజు తాజాగా విడుదలైన ప్రోమోలో ఎవిక్షన్ ఫ్రీ పాస్ గెలుచుకున్న అర్జున్.. 1 నుంచి 5 వరకు ర్యాంక్ పొందిన ఇంటి సభ్యులతో పోరాడి దాన్ని డిఫెండ్ చేసుకోవాలని" తెలిపారు. "

Bigg Boss 7 Telugu: అర్జున్ తో పోటీకి యావర్.. ఎవరి బాల్ పడింది..?
New Update

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7.. అంతా ఉల్టా పుల్టా అన్నట్లుగానే సాగింది నిన్నటి ఎపిసోడ్. ర్యాంకింగ్ టాస్క్ లో బాటమ్ 5 లో ఉన్న సభ్యులు ఎవిక్షన్ ఫ్రీ పాస్ టాస్క్ లో పాల్గొన్నారు. ఈ టాస్క్ లో అర్జున్ గెలిచి 'ఎవిక్షన్ ఫ్రీ పాస్' సొంతం చేసుకున్నాడు. ఇక అర్జున్ 'ఎవిక్షన్ ఫ్రీ పాస్'  గెలిచానని హ్యాపీగా ఫీల్ అయ్యే లోపే మరో ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. 'ఎవిక్షన్ పాస్' గెలుచుకున్న అర్జున్ దాన్ని డిఫెండ్ చేసుకోవాలని చెప్పారు. ఇక ఈ రోజు తాజాగా విడుదలైన ప్రోమోలో.. "అర్జున్ మీ ఎవిక్షన్ ఫ్రీ పాస్ ను.. 1 నుంచి 5 వరకు ర్యాంక్ పొందిన ఇంటి సభ్యులతో పోరాడి.. డిఫెండ్ చేసుకోవాలని" తెలిపారు." ఈ ఆటలో అర్జున్ తో ఆడి ఓడిపోయిన వాళ్ళు 'ఎవిక్షన్ ఫ్రీ పాస్' రేసు నుంచి తొలగిపోతారని" చెప్పారు బిగ్ బాస్.

publive-image

ఈ ఛాలెంజ్ లో బిగ్ బాస్ ఇంటి సభ్యులకు ఇచ్చిన టాస్క్.. బిగ్ బాస్ ఏర్పర్చిన ప్లాట్ ఫార్మ్ పై ఉన్న స్లాట్స్ లో.. అన్ని బాల్స్.. బ్యాలన్స్ చేయాలనీ చెప్పారు. ఈ టాస్క్ లో అర్జున్ తో పోటీ పడడానికి.. టాప్ 5 ర్యాంకింగ్స్ లో 2 స్థానంలో ఉన్న యావర్ వచ్చాడు.

Bigg Boss 7 Telugu

బిగ్ బాస్ ఇచ్చిన ఈ ఛాలెంజ్ లో ఇద్దరు చాలా ఆసక్తికరంగా ఆడారు. ఈ టాస్క్ లో సంచాలకుడిగా అమర్ వ్యవహరించాడు. టాస్క్ పూర్తయ్యాక .. రతిక, అశ్విని టాస్క్ గురించి గాసిప్స్ మొదలు పెట్టారు. రతిక.. అర్జున్ తో మాట్లాడుతూ.. "అమర్ ఏదైనా మాట్లాడతాడు అనుకున్నాను.. అంత గ్రూప్స్ గా ఆడుతున్నారు" అని చెప్పింది. ఇక అశ్విని.. అమర్ కూడా ఏం మాట్లాడలేకపోయాడు.. చెప్పాలంటే అర్జున్ లానే గేమ్ ఆడాలి అని మాట్లాడింది. రతిక అశ్విని ఇద్దరి మాటలు చూస్తుంటే.. యావర్ గేమ్ తప్పుగా ఆడినట్లుగా వీళ్ళ ఆరోపణలు ఉన్నాయి. ఇక యావర్ మాత్రం.. "ఒక వేళ ఏదైనా చీట్ చేస్తే.. అప్పుడు చెప్తా.. కెమెరా ముందుకు వెళ్లి" అని శివాజీ, ప్రశాంత్ మాట్లాడాడు. ఇక ఈ గేమ్ లో ఎవరు గెలిచారో తెలియాలంటే ఎపిసోడ్ చూడాల్సిందే.

Bigg Boss 7 Telugu

Also Read: Bigg Boss 7 Telugu: ఎవిక్షన్ ఫ్రీ పాస్ గెలిచిన అర్జున్.. మళ్ళీ పెద్ద ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్

#bigg-boss-7-telugu #bigg-boss-7-latest-episode #bigg-boss-7-telugu-latest-updates #bigg-boss-7
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe