Bigg Boss 7 Telugu Promo: బిగ్ బాస్ సీజన్ 7.. బిగ్ బాస్ ఇంట్లో ఫ్యామిలీ వీక్ సందర్భంగా హౌస్ మేట్స్.. ఫ్యామిలీ మెంబర్స్ ఇంట్లోకి వచ్చారు. బిగ్ బాస్ హౌజ్ అంటేనే గొడవలు, ఏడుపులు, సంతోషం, భాదలు ఇలా ఫుల్ ఆఫ్ ఎమోషన్స్ తోసాగుతుంది. ఇక ఈ వారం ఫ్యామిలీ వీక్ ఎపిసోడ్ తో బిగ్ బాస్ ఇల్లంతా ఎమోషనల్ గా మారింది. ఇక లేటెస్ట్ గా విడుదలైన ప్రోమోలో యావర్ బ్రదర్ ఇంట్లోకి వచ్చారు.
బిగ్ బాస్.. ప్రతి ఫ్యామిలీ మెంబర్ ఎంట్రీని చాలా సర్ ప్రైజింగ్ గా ప్లాన్ చేశారు. యావర్ బ్రదర్ ఎంట్రీ కూడా అలానే ప్లాన్ చేశారు బిగ్ బాస్. యావర్ బ్రదర్ ను డైరెక్ట్ గా ఇంట్లోకి పంపించకుండా.. తన వాయిస్ మాత్రమే వినిపించి కాసేపు టెన్షన్ పెట్టాడు. తన బ్రదర్ ఎక్కడున్నాడని ఇల్లంతా వెతుకుతూ ఉండగా.. సడన్ గా బిగ్ బాస్ ఇంట్లోని యాక్టివిటీ రూమ్ నుంచి బయటకు రాగానే యావర్ షాక్ అయ్యాడు.
యావర్ తన బ్రదర్ ను చూడగానే ఎమోషనల్ గా ఫీల్ అయ్యాడు. ఇక యావర్ బ్రదర్ ఇంటి సభ్యులందరినీ పరిచయం చేసుకున్నాడు. ఆ తర్వాత యావర్ బ్రదర్.. 'గౌతమ్ థాంక్స్ .. యావర్ కు అమ్మ ప్రేమ తెలియదు .. మీ అమ్మ గారు వచ్చినప్పుడు తనను బాగా చూసుకున్నారని ఎమోషల్ అయ్యాడు'. యావర్, తన బ్రదర్ ఇద్దరు వాళ్ళ అమ్మ గుర్తొచ్చి బాగా ఏడ్చేశారు. ఇక వీళ్ళిద్దరిని ఓదార్చిన శివాజీ కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడు. అమ్మ కోసం వీళ్ళ కన్నీళ్లు చూసిన ప్రేక్షకులు కూడా ఎమోషనల్ గా ఫీల్ అయ్యారు.
యావర్ బ్రదర్ ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు.. 'నువ్వు ఒక ఫైటర్.. నీ ఆట కోసం గట్టిగా ఫైట్ చెయ్.. నువ్వు తెచ్చే కప్పు కోసం మేమంతా ఎదురుచూస్తున్నామని' చెప్పాడు. యావర్ చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న.. తన బ్రదర్ ఇంట్లోకి రావడంతో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇక ఈ ప్రోమో చూస్తుంటే ఎపిసోడ్ చాలా ఎమోషనల్ గా ఉండబోతున్నట్లుగా కనిపించింది.
Also Read: Bigg Boss 7 Telugu Promo: యావర్ కోసం.. శోభ మదర్ సర్ ప్రైజ్ గిఫ్ట్..!