Bigg Boss Season 7 Telugu: హెడ్ వెయిట్ పెరిగింది.. శివాజీ పై నాగార్జున షాకింగ్ కామెంట్స్..!

బిగ్ బాస్ సీజన్ 7.. నిన్నటి ఎపిసోడ్ లో నాగార్జున.. ఫైనల్ కెప్టెన్సీ కంటెండర్స్ గా ఎంపికైన శివాజీ, అర్జున్ ఇద్దరిలో ఇంటి నెక్స్ట్ కెప్టెన్ అయ్యేదెవరో ఇంటి సభ్యులు నిర్ణయించాలని తెలిపారు. ఈ ప్రక్రియలో మెజారిటీ సభ్యుల నిర్ణయంతో శివాజీ ఇంటి నెక్స్ట్ కెప్టెన్ గా ఎంపికయ్యారు.

Bigg Boss Season 7 Telugu: హెడ్ వెయిట్ పెరిగింది.. శివాజీ పై నాగార్జున షాకింగ్ కామెంట్స్..!
New Update

Bigg Boss Season 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7.. ఈ వారం బిగ్ బాస్ ఇంట్లోకి ఫ్యామిలీ మెంబర్స్ రావడంతో ఇంటి సభ్యులంతా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇక నిన్న వీకెండ్ ఎపిసోడ్ లో హౌస్ మేట్స్ అందరికీ వారంలో వాళ్ళు చేసిన తప్పుల గురించి మాట్లాడి గట్టిగా క్లాస్ ఇచ్చారు నాగార్జున.

శోభ గుడ్ కెప్టెన

నాగార్జున.. ఇంటి సభ్యులందరినీ ఈ వారం శోభ కెప్టెన్సీ ఎలా ఉందని అడిగారు. మెజారిటీ ఇంటి సభ్యులు శోభ గుడ్ కెప్టెన్ అని ఓట్ చేశారు. అర్జున్, యావర్ మాత్రం శోభ కెప్టెన్ గా తన బాధ్యతలను సరిగ్గా నిర్వహించలేదని తెలిపారు. మెజారిటీ సభ్యులు శోభ కెప్టెన్సీ నచ్చిందని చెప్పినందున.. నాగార్జున కూడా శోభ గుడ్ కెప్టెన్ అని ప్రశంశలు కురిపించారు. ఆ తర్వాత ఫైనల్ కెప్టెన్సీ కంటెండర్స్ గా ఎంపికైన శివాజీ, అర్జున్ ఇద్దరిలో ఇంటి నెక్స్ట్ కెప్టెన్ అయ్యేదెవరో ఇంటి సభ్యులు నిర్ణయించాలని నాగార్జున తెలిపారు.

publive-image

ఇంటి నెక్స్ట్ కెప్టెన్ గా ఎంపికైన శివాజీ

హౌస్ మేట్స్ అందరు కన్ఫెషన్ రూమ్ లోకి వచ్చి అర్జున్, శివాజీ ఇద్దరిలో కెప్టెన్ అవ్వడానికి ఎవరు అర్హులు అని భావిస్తున్నారో వాళ్ళ పేరు చెప్పి.. దానికి కారణం కూడా చెప్పాలని తెలిపారు. వీళ్ళ ఇద్దరి మధ్య జరిగిన ఓటింగ్ లో.. ఇంటి సభ్యులంతా శివాజీ.. కెప్టెన్ అవ్వాలని ఓట్ వేశారు. ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే దానికి ముందు రోజు కెప్టెన్సీ టాస్క్ లో శివాజీతో  గొడవ పడిన గౌతమ్ కూడా శివాజీకే ఓట్ చేశాడు. "నేను కెప్టెన్ అవ్వడానికి శివాజీ హెల్ప్ చేశారు.. దానికి కృతజ్ఞత గా నేను.. ఇప్పుడు ఆయన కెప్టెన్ అవ్వాలని ఆశిస్తున్నానని" ఓట్ చేశాడు గౌతమ్. ఇంటి సభ్యుల మెజారిటీ ఓటింగ్ తో శివాజీ బిగ్ బాస్ ఇంటి నెక్స్ట్ కెప్టెన్ గా ఎంపికయ్యారు.

publive-image

హౌస్ మేట్ గా ఫెయిల్ అయిన రతిక

ఆ తర్వాత నాగార్జున.. 10 వారాలు చూసిన ఆట ప్రకారం ఇంటి సభ్యులుగా పాస్ ఎవరు.. ఫెయిల్ ఎవరో చెప్పాలని నాగార్జున అడిగారు. ఈ సందర్భంగా ఇంటి సభ్యులు వాళ్ళ అభిప్రాయాన్ని తెలిపారు. అమర్, ప్రియాంక, భోలే, ప్రశాంత్, శోభ, అశ్విని, గౌతమ్, శివాజీతో పాటు మెజారిటీ ఇంటి సభ్యులు .. హౌస్ మేట్ గా రతిక ఫెయిల్ అయినట్లుగా తెలిపారు. దానికి అందరు చెప్పిన రీజన్.. ఒకసారి ఎలిమినేట్ అయ్యి.. మళ్ళీ వచ్చాక కూడా రతిక తన గేమ్ ఇంకా స్టార్ట్ చేయలేదు.. తన ఎఫర్ట్స్ ఎక్కడ కనిపించట్లేదు అని చెప్పారు.

publive-image

శివాజీ.. బరువు తగ్గావు కానీ హెడ్ వెయిట్ పెరిగింది..

నామినేషన్స్ సమయంలో రాజమాతలుగా వ్యవహరించిన.. అశ్విని, రతిక, ప్రియాంక, శోభ పై శివాజీ చేసిన కామెంట్స్ పై నాగార్జున.. ఒక వీడియోను  చూపించారు. ఆ వీడియోలో శివాజీ.. "రాజమాతలు మీ మోతలు పగులుతాయ్"  అని కామెంట్స్ చేశారు. దాని పై శివాజీ స్పందిస్తూ.. అది ఎవరినీ ఉద్దేశించి అనలేదు సార్.. సరదాగా అన్నాను అని కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు. దీని పై నాగార్జున మాట్లాడుతూ.. మనం మాట్లాడే.. కొన్ని మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.. అవతలి వారికి అవి తప్పుగా అర్ధమయ్యే ఛాన్స్ ఉంటుందని తెలిపారు. అయితే ఎపిసోడ్ స్టార్టింగ్ లో నాగార్జున.. శివాజీ.. బరువు తగ్గావు కానీ హెడ్ వెయిట్ పెరిగింది అని అన్నారు. ఈ మాటలు నాగార్జున.. శివాజీ రాజమాతల పై చేసిన కామెంట్స్ ను ఉద్దేశించే అన్నట్లుగా అనిపించింది.

publive-image

Also Read: Bigg Boss 7 Telugu Promo: “తిట్టనీ.. నరికేయనీ”.. నా గేమ్ నా ఇష్టం.. రెచ్చిపోయిన గౌతమ్, శివాజీ..!

#bigg-boss-7 #bigg-boss-7-latest-episode #bigg-boss-7-telugu #bigg-boss-7-promo #bigg-boss-7-telugu-latest-updates
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe