బిగ్ బాస్-7 తెలుగు కంటెస్టెంట్స్ ఫైనల్ లిస్ట్ ఇదే..!

బిగ్ బాస్.. దేశంలోని అన్ని భాషల్లో విజయంతంగా రన్ అవుతున్న రియాలిటీ షో. ఈ షోకు సెపరేట్ ఫ్యాన్‌ ఫాలోయింగ్ ఉంది. ఈ షో యూత్‌ను చెడగొడుతోంది.. బ్యాన్ చేయాలనే వారు కూడా ఉన్నారనుకోండి. అది వేరే విషయం. త్వరలోనే బిగ్ బాస్7 తెలుగు సీజన్ ప్రసారం కానుంది. దాంతో అందరూ ఈ షోకు ఎలాంటి సెలబ్రెటీలు వస్తున్నారనే దానిపై ఆసక్తిగా ఉన్నారు. తాజాగా నెట్టింట్లో ఇదే ఫైనల్ లిస్ట్ అంటూ ఓ వార్త చక్కర్లు కొడుతోంది.

New Update
బిగ్ బాస్-7 తెలుగు కంటెస్టెంట్స్ ఫైనల్ లిస్ట్ ఇదే..!

ప్రపంచంలోనే బిగ్గెస్ట్ రియాలిటీ షో అయిన బిగ్ బాస్‌కు దేశవ్యాప్తంగా ప్రత్యేక అభిమానులు ఉన్నారు. ఆ షోలో కంటెస్టెంట్స్ మధ్య జరిగే మాటల యుద్ధం, ప్రేమ, సెంటిమెంట్ ఎలా జరుగుతుందనే దానిపై తెగ చర్చింకుంటూ ఉంటారు. దీనిపై సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా చేస్తూ ఉంటారు. అంతేనా వారికి అభిమాన సంఘాలు అంటూ ప్రొఫైల్స్ పేజీలు కూడా రన్ చేస్తూ ఉంటారు. అంత హడావిడి ఉంటుంది మరి ఈ షోకి. దేశవ్యాప్తంగా పాపులర్ అయిన ఈ షో 2017లో తెలుగులో కూడా ప్రసారం కావడం మొదలైంది. తాజాగా 7వ సీజన్ మరికొన్ని రోజుల్లో ప్రారంభంకానుంది. నెట్టింట్లో ఇదే ఫైనల్ లిస్ట్ అంటూ ఓ వార్త చక్కర్లు కొడుతోంది.

ఈ లిస్టులో యాంకర్ విష్ణుప్రియ, యాంకర్ రష్మీ, జబర్దస్త్ కమెడియన్ బుల్లెట్ భాస్కర్, కార్తీకదీపం సీరియల్ ఫేమ్ శోభాశెట్టి, ఐశ్వర్య, అమర్‌దీప్, అనూష, డ్యాన్సర్ సందీప్, అంజలి, షెట్టాల్, రంగస్థలం నటుడు మహేష్, యావర్, శుభశ్రీ, షావలి, మైవిలేజ్ అనిల్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అయితే ఇందులో ఎంతవరకు నిజమనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాలి. బిగ్ బాస్ ఇంట్లోకి ఈసారి దాదాపు 22 మంది కంటెస్టెంట్స్ అడుగుపెట్టనున్నారని తెలుస్తోంది. సెప్టెంబర్ 3న స్టార్ మాలో ఈ షో ప్రారంభం కానుంది. ఈసారి న్యూ రూల్స్, న్యూ ఛాలెంజెస్, న్యూ గేమ్.. అంతా ఉల్టా పల్టా ఉండనుందని ఇటీవల విడుదలైన ప్రోమోలో మరింత ఆసక్తిని క్రియేట్ చేశారు నాగార్జున.

ఇదిలా ఉండగానే తాజాగా భారత మాజీ క్రికెటర్ వేణుగోపాల్‌రావుని కంటెస్టుగా హౌస్‌లోకి తీసుకొస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇండియా టీంలో చోటు దక్కించుకున్న కొద్దిమంది తెలుగు ఆటగాళ్లలో వేణుగోపాల్ ఒక్కరు. భారత్ తరపున తక్కువ మ్యాచులే ఆడినా ఐపీఎల్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్నారు. అనంతరం క్రికెట్‌గా గుడ్ బై చెప్పిన వేణు.. తెలుగులో ప్రసారమయ్యే క్రికెట్ మ్యాచులకు కామెంటరీ చేస్తున్నారు. వేణును తీసుకుంటే మంచి బజ్ వస్తుందని భావిస్తున్నారట. ఇటు క్రికెట్ ఫ్యాన్స్ కూడా తమకు కలిసివస్తారని ప్లాన్ చేస్తున్నారట. అయితే క్రికెటర్‌గా పేరు తెచ్చుకున్న ఆయన బిగ్ బాస్‌ లాంటి షోలో పాల్గొంటాడా? లేదా? అనే దానిపై సస్పెన్స్ నెలకొంది. ఒకవేళ వేణు పాల్గొంటే మాత్రం బిగ్ బాస్‌లో పాల్గొన్న తొలి క్రికెటర్‌గా నిలవనున్నాడు.

Advertisment
Advertisment
తాజా కథనాలు