Bigg Boss 7 Telugu: భోలే ఎలిమినేటెడ్..! రతికకు ఊహించని ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్ ..!

బిగ్ బాస్ సీజన్ 7.. ఇక ఈ వారం నామినేషన్స్ లో ఉన్న శివాజీ, భోలే, గౌతమ్, యావర్, రతిక ఐదుగురిలో రతిక ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని సోషల్ మీడియాలో బజ్ వినిపిస్తోంది. ఊహించని విధంగా భోలే కూడా ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని ప్రేక్షకులు భావిస్తున్నారు.

New Update
Bigg Boss 7 Telugu: "అమర్.. ఎవ్వరికీ భయపడకు.. తిప్పరా మీసం".. మానస్ మాస్ డైలాగ్ ..!

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7.. ఇక ఈ వారం బిగ్ బాస్ ఇంటి నుంచి ఎలిమినేట్ అయ్యేది ఎవరినీ.. ఇప్పటికే సోషల్ మీడియాలో చాలా గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఈ వారం నామినేషన్స్ లో ఉన్న ఇంటి సభ్యులు భోలే, శివాజీ, రతిక, యావర్, గౌతమ్. నామినేషన్స్ లో ఉన్న ఐదుగురి సభ్యుల్లో రతిక ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నట్లు సోషల్ మీడియాలో బజ్ నడుస్తోంది. ఈ ఎలిమినేషన్ లిస్ట్ లో షాకింగ్ గా మరో పేరు కూడా వినిపిస్తోంది. ఉల్టా పుల్టా అన్నట్లుగా సాగుతున్న ఈ సీజన్ లో ఊహించని విధంగా భోలే కూడా ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని అనుకుంటున్నారు.

publive-image

ఈ వారం నామినేషన్స్ లో ఉన్న ఐదుగురిలో.. ఆన్లైన్ ఓటింగ్ ప్రకారం శివాజీ, యావర్, గౌతమ్ టాప్ లో ఉన్నారు. భోలే, రతిక ఇద్దరు లీస్ట్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది. వీళ్ళిద్దరిలో రతిక ఎలిమినేట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందని భావిస్తున్నారు. ఒకసారి ఎలిమినేట్ అయ్యి.. రీ ఎంట్రీ ఇచ్చిన రతిక.. తన గేమ్ పై ప్రేక్షకుల్లో అంతగా ఇంప్యాక్ట్ క్రియేట్ చేయలేక పోయిందని హౌస్ మేట్స్ తో పాటు ప్రేక్షకులు కూడా భావిస్తున్నారు. ఇది కూడా తన ఎలిమినేషన్ కు ఒక కారణం అయ్యే అవకాశం ఉంది. అంతే కాకుండా రతిక క్లోజ్ ఉండే యావర్, శివాజీ కూడా ఈ వారం నామినేషన్స్ లో ఉండడంతో వాళ్ళ ఓట్స్ కూడా పడే అవకాశం లేదు. దీని వల్ల ఈ వారం ఎలిమినేట్ అయ్యేది రతికనే అని సోషల్ మీడియాలో గట్టిగా టాక్ వినిపిస్తోంది.

publive-image

ఈ వారం ఇంకో ట్విస్ట్ కూడా ఉండొచ్చు. ఊహించని విధంగా.. తన మాటలు, పాటలతో ప్రేక్షకులను బాగా ఎంటర్ టైన్ చేస్తున్న భోలే కూడా ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని అనుకుంటున్నారు. భోలే స్ట్రాంగ్ అని భావించిన ప్రేక్షకులు.. తను ఎలాగైనా సేవ్ అవుతాడు అనే భావనతో.. ఓట్స్ వేరే వాళ్లకు వేయడం.. కూడా భోలే ఎలిమినేషన్ కు కారణం అయ్యే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు.

publive-image

Also Read: Bigg Boss 7: అర్జున్ కు డైరెక్టర్ బుచ్చిబాబు ఆఫర్.. రామ్ చరణ్ మూవీలో సూపర్ రోల్..!

Advertisment
తాజా కథనాలు