Bigg Boss 7: అర్జున్ కు డైరెక్టర్ బుచ్చిబాబు ఆఫర్.. రామ్ చరణ్ మూవీలో సూపర్ రోల్..! బిగ్ బాస్ సీజన్ 7.. దీపావళి స్పెషల్ ఎపిసోడ్ ప్రోమో విడుదలైంది. స్పెషల్ ఎపిసోడ్ సందర్భంగా మీ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ స్టేజ్ పైకి రాబోతున్నారని ఇంటి సభ్యులకు సర్ ప్రైజ్ ఇచ్చారు నాగార్జున. By Archana 12 Nov 2023 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి Bigg Boss 7: బిగ్ బాస్ సీజన్ 7.. బిగ్ బాస్ ఇంట్లో దీపావళి స్పెషల్ ఎపిసోడ్ ప్రోమో వచ్చేసింది. ఈ ప్రోమోలో నాగార్జునతో పాటు పలువురు సెలెబ్రెటీస్ కూడా బిగ్ బాస్ స్టేజ్ పై సందడి చేశారు. దీపావళి స్పెషల్ ఎపిసోడ్ సందర్భంగా సెలబ్రెటీల ఆట, పాటలతో బిగ్ బాస్ స్టేజ్ అంతా సందడిగా మారింది. 'సత్య భామ', 'ఆదికేశవ' మూవీ ప్రమోషన్స్ లో భాగంగా కాజల్, శ్రీలీల, వైష్ణవ తేజ్, డైరెక్టర్ బుచ్చిబాబు నాగార్జునతో కలిసి స్టేజ్ పై సందడి చేశారు. దీపావళి సందర్బంగా.. మీ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ స్టేజ్ పైకి రాబోతున్నారని ఇంటి సభ్యులకు సర్ ప్రైజ్ ఇచ్చారు నాగార్జున. అమర్ దీప్ కోసం.. అమర్ బెస్ట్ ఫ్రెండ్ మానస్, వాళ్ళ అమ్మ ఇద్దరు స్టేజ్ పైకి వచ్చారు. అమర్ మదర్ మాట్లాడుతూ.. "నువ్వు కప్పు తెచ్చేవరకు.. నాన్న హైదరాబాద్ రానన్నారని చెప్పింది. ఇక మానస్ ను చూడగానే అమర్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇక మానస్.. "ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు.. మీసం తిప్పరా నువ్వు" అంటూ అమర్ కు ఫుల్ కాన్ఫిడెన్స్ ఇచ్చాడు. ఆ తర్వాత అర్జున్.. మానస్ అడ్వాన్స్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని చెప్పాడు. దానికి నాగార్జున అడ్వాన్స్ బర్త్ డే ఉంటుంది .. అడ్వాన్స్ మ్యారీడ్ లైఫ్ ఏంటి అని అర్జున్ ఫన్ చేశారు నాగార్జున. ఆ తర్వాత వచ్చిన ప్రియాంక మదర్.. నాకు చాల గర్వంగా ఉంది నా కూతురిని చూస్తుంటే అని కన్నీళ్లు పెట్టుకుంది. ఇక యావర్ కోసం వచ్చిన జబర్దస్త్ ఇమ్మాన్యేల్, యావర్ ఫ్రెండ్ స్టేజ్ పైకి వచ్చారు. ఇమ్మాన్యేల్.. "యావర్ కు తెలుగు రాదు.. నాకు తెలుగు తప్ప మిగతావి రావు" అని ఫన్ కాసేపు ఫన్ చేశాడు. బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చిన డైరెక్టర్ బుచ్చిబాబు.. అర్జున్ కు బంపర్ ఆఫర్ ఇచ్చారు. రాంచరణ్ మూవీలో సూపర్ క్యారెక్టర్ చేయబోతున్నావని భారీ ఆఫర్ ఇచ్చారు. ఈ మాట వినగానే అర్జున్ ఆనందంలో తేలిపోయాడు. చివరిగా స్టేజ్ పైకి శివాజీ కోసం.. కొడుకు, భార్య ఇద్దరు వచ్చారు. ఇక శివాజీ కొడుకు రాగానే.. హయ్ భోలే అన్న అని అనగానే.. అన్న కాదురా.. బాబాయ్ అని చెప్పాడు శివాజీ. దానికి శివాజీ కొడుకు "బాబాయ్ కాదు నాన్న.. భోలే హీరో అంటూ" మామూలుగా ఫన్ చేయలేదు. ఆ తర్వాత శోభను ఆంటీ అని పిలిచాడు.. దాంతో వాళ్ళ అమ్మ ఆంటీ కాదు.. అక్క అని చెప్పారు. దానికి శివాజీ కొడుకు.. "మా అమ్మను ఆంటీ అని పిలుస్తుంది అని కామెంట్ చేశాడు. చివరికి నాగార్జున శివాజీ.. "నీ కొడుకులో మంచి సెన్సాఫ్ హ్యూమర్ ఉందని చెప్పగా.. నా మీద ఇంట్లో వాడే జోకులు వేస్తాడని తెలిపారు శివాజీ. Also Read: Bigg Boss Season 7 Telugu: హెడ్ వెయిట్ పెరిగింది.. శివాజీ పై నాగార్జున షాకింగ్ కామెంట్స్..! #bigg-boss-7-telugu #bigg-boss-7 #bigg-boss-7-telugu-latest-updates #bigg-boss-7-promo #bigg-boss-7-latest-episode మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి