/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/FotoJet-93-jpg.webp)
Bigg Boss Season 7 Promo: బిగ్ బాస్ సీజన్ 7 వీకెండ్ ఎపిసోడ్ ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో బిగ్ బాస్ స్టేజ్ పైకి నాగార్జున ఒక స్పెషల్ గెస్ట్ తో కనిపించి ఇంటి సభ్యులను సర్ ప్రైజ్ చేశారు. 'జపాన్' మూవీ ప్రమోషన్స్ లో భాగంగా హీరో కార్తీ బిగ్ బాస్ షోలో సందడి చేశారు. హోస్ట్ నాగార్జున గెస్ట్ గా వచ్చిన కార్తీని ఇంటి సభ్యులకు పరిచయం చేస్తూ.. శోభ, అశ్వినిని ఆటపట్టించారు.
కార్తీ స్టేజ్ పైకి రాగానే.. నీ సినిమాలా 'జపాన్' క్యారెక్టర్లు ఈ హౌస్ లో చాలా మందికి ఉన్నాయని అన్నారు. ఆ తర్వాత కార్తీ మాట్లాడుతూ.. సినిమాలో గుడ్, బ్యాడ్ రెండు క్యారెక్టర్స్ ఉన్నాయి.. కానీ సినిమా మొత్తం బ్లాకే అని అన్నారు. ఈ సందర్భంగా నాగార్జున.. నేను కూడా మీకు హౌస్ మేట్స్ డార్క్ సైడ్స్ పరిచయము చేస్తానని అన్నారు. ముందుగా అశ్విని తో మొదలు పెట్టారు.
అశ్విని గురించి మాట్లాడుతూ.. అశ్విని అందమైన అమ్మాయి కానీ అందరికీ పుల్లలు పెడుతుంది అంటూ అశ్వినిని ఆట పట్టించారు. ఆ తర్వాత ప్రశాంత్ గురించి చెబుతూ.. ప్రస్తుతం మనకు కనపడేది రామమమ్ క్యారెక్టర్.. కానీ నామినేషన్ వస్తే అపరిచితుడు బయటకు వస్తాడు అని తెలిపారు. దానికి ప్రశాంత్ సిగ్గుపడుతూ నవ్వాడు.
ఆ తర్వాత నాగార్జున.. శోభ డార్క్ సైడ్ ఏంటో తేజ చెప్తాడు అంటూ శోభ, తేజ ఇద్దరినీ కాసేపు ఆటపట్టించారు. ఇక తేజ 'నన్ను ఇన్వాల్వ్ చేయకండి సార్'.. అని తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. 'భయం ఎందుకు తేజ నిజాయితీగా శోభ డార్క్ సైడ్ ఏంటో చెప్పు అని ఫన్ చేశారు నాగార్జున'. నెక్స్ట్ అమర్ లేవగానే.. 'నేను నిన్ను నిలబడమన్నానా' అని అన్నారు నాగార్జున. దానికి కార్తీ 'ఇది ర్యాగింగ్ లా ఉంది అన్నయ్య' అంటూ నవ్వారు. ఇక ప్రోమో చివరిలో.. మిగతా హౌస్ మేట్స్ తో కూడా మాట్లాడేది చాలా ఉంది. ఇంతటితో అయిపోయిందని అనుకోవద్దు అంటూ ఇంటి సభ్యులను భయపెట్టారు నాగార్జున. లాస్ట్ లో నాగార్జున చెప్పిన డైలాగ్ చూస్తుంటే ఈ వారం ఇంటి సభ్యులు చేసిన తప్పులకు గట్టిగానే క్లాస్ ఇవ్వబోతున్నట్లుగా కనిపించారు.
Also Read: Bigg Boss 7 Telugu: శోభ ఎలిమినేటెడ్..? అమర్ కు బిగ్ బాస్ సర్ ప్రైజ్..!