Bigg Boss 7 Telugu Promo: రాననుకున్నారా, రాలేననుకున్నారా ..? బిగ్ బాస్ లో గౌతమ్ రీ ఎంట్రీ..!

బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా పుల్టా ఎలిమినేట్ అయిన గౌతమ్ సీక్రెట్ రూమ్ నుంచి మళ్ళీ ఇంట్లోకి ఎంట్రీ.. ఇక నుంచి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన పోటుగాళ్ళ టీం లో ఆడబోతున్న గౌతమ్

New Update
Bigg Boss 7 Telugu Promo: రాననుకున్నారా, రాలేననుకున్నారా ..? బిగ్ బాస్ లో గౌతమ్ రీ ఎంట్రీ..!

Bigg Boss 7 Telugu Promo: బిగ్ బాస్ 7 2.0 గ్రాండ్ లాంచ్ అంటూ బిగ్ బాస్ 5 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ (Wild Card Entries) ని బిగ్ బాస్ ఇంట్లోకి పంపారు. అయితే వీకెండ్ ఎపిసోడ్ లో శుభ శ్రీ, గౌతమ్ (Gautam) ఇద్దరు డబల్ ఎలిమినేషన్ అంటూ బిగ్ బాస్ పెద్ద ట్విస్ట్ ఇస్తాడు. ముందు శుభ శ్రీ ఎలిమినేట్ అయ్యి స్టేజ్ పైకి వస్తుంది. ఆ తర్వాత ఇంట్లో ఉండటానికి అర్హత లేదనే కారణంతో ఇంటి సభ్యులంతా గౌతమ్ కి ఓట్ వేసి ఇంటి నుంచి బయటకు పంపుతారు. హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి స్టేజ్ పైకి వచ్చిన గౌతమ్ నాగార్జున (Nagarjuna) షాక్ ఇస్తాడు.. గౌతమ్ నువ్వు ఎలిమినేట్ అవ్వలేదు , నువ్వు సీక్రెట్ రూమ్ కు వెళ్తున్నావ్ అని గౌతమ్ ని సీక్రెట్ రూమ్ కి(Secret room) పంపిస్తారు.

అశ్వద్ధామ ఈజ్ బ్యాక్

సీక్రెట్ రూమ్ లోకి వెళ్లిన గౌతమ్ ఇంటి సభ్యుల ఆటను గమనిస్తాడు. ఇక తనతో మంచిగా ఉంటూనే అందరు కలిసి తనను బయటకు పంపించారని చాలా కోపంగా ఉంటాడు.. బిగ్ బాస్ నన్ను త్వరగా ఇంట్లోకి పంపండి నా ఆట ఏంటో చూపిస్తా అంటూ బిగ్ బాస్ తో(Bigg Boss) మాట్లాడతాడు. ఇక బిగ్ బాస్ గౌతమ్ మీరు ఇంట్లోకి వెళ్లే సమయం వచ్చేసింది అని చెప్తాడు.

రాననుకున్నారా, రాలేననుకున్నారా ..?

ఇక నిన్న ఎపిసోడ్ లో పోటుగాళ్ళు vs ఆటగాళ్ళ నామినేషన్స్(Nominations) కంప్లీట్ అయ్యాక.. గౌతమ్ అశ్వద్ధామ ఈజ్ బ్యాక్.. రాననుకున్నారా, రాలేననుకున్నారా ..? అంటూ ఒక పవర్ ఫుల్ డైలాగ్ తో గౌతమ్ సీక్రెట్ రూమ్ నుంచి రీ ఎంట్రీ ఇచ్చాడు. దాంతో హౌస్ మేట్స్ అంత షాక్ అయిపోయి చూస్తారు.

గౌతమ్ కు స్పెషల్ పవర్..

సీక్రెట్ రూమ్ నుంచి బయటకు వచ్చిన గౌతమ్ బిగ్ బాస్ ఒక స్పెషల్ పవర్ ఇస్తాడు.. ఇంటి సభ్యులలో ఒకరిని డైరెక్ట్ నామినేట్ చేయాలంటూ.. ఇక గౌతమ్ తేనే పూసిన కత్తితో నా గొంతు కోశారు, నన్ను బయటకు పంపారు. ఇది బిగ్ బాస్ 2.0 (Bigg Boss 7 2.0) మళ్ళీ ఆట మొదలైంది అంటూ డైలాగ్స్ వేస్తాడు.

శివాజీ తో గొడవ

సీక్రెట్ రూమ్ నుంచి వచ్చిన గౌతమ్ ముందు శివాజీ (Sivaji) తో గొడవ వేసుకున్నట్లు కనిపిస్తుంది.. అన్న ప్యాంట్ విప్పి తిరిగితే ఎంటర్టైన్మెంట్ కాదన్నా.. నువ్వు నన్నుఎంటర్టైన్మెంట్ చెయ్యట్లేదని బయటకు పంపావు అంటూ శివాజీ తో ఆర్గుమెంట్ స్టార్ట్ చేసాడు.

ప్రోమో లో గౌతమ్ చాలా పవర్ ఫుల్ డైలాగ్స్ తో ఎంట్రీ ఇచ్చాడు మరి తన ఆట కూడా పవర్ ఫుల్ గా ఉంటుందా లేదా పెద్ద జోకర్ అవుతాడా అనేది చూడాలి. సోషల్ మీడియాలో గౌతమ్ రీ ఎంట్రీ చెప్పిన డైలాగ్స్ కి నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి.. సీక్రెట్ రూమ్ గౌతమ్ ఆటకు ప్లస్ అవుతుందా, మైనస్ అవుతుందో చూడాలి.

Also Read: Thaman: డైరెక్టర్ బోయపాటికి థమన్ షాక్.. సంచలన ట్వీట్..!

Advertisment
తాజా కథనాలు