Bigg Boss : బిగ్ బాస్ హౌస్‌లో లైవ్‌లో శృంగార వీడియో.. చిఛీ.. ఏందీ రోత..?

బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 3 లో జరిగిన ఓ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. షో లో పాల్గొంటున్న ఇద్దరు కంటెస్టెంట్లు లైవ్ స్ట్రీమ్ లో శృంగార దృశ్యాలు కనిపించాయి. ఈ వీడియోపై నెటిజన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ బిగ్ బాస్‌ను నిషేదించాలని కామెంట్స్ చేస్తున్నారు.

New Update
Bigg Boss : బిగ్ బాస్ హౌస్‌లో లైవ్‌లో శృంగార వీడియో.. చిఛీ.. ఏందీ రోత..?

Bigg Boss OTT Season 3 : బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 3 లో జరిగిన ఓ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. షో లో పాల్గొంటున్న ఇద్దరు కంటెస్టెంట్లు లైవ్ స్ట్రీమ్ లో శృంగార దృశ్యాలు కనిపించడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి జరిగింది. ఒక కంటెస్టెంట్ తన గదిలో మరొక కంటెస్టెంట్ తో కలిసి ఉండగా, లైవ్ స్ట్రీమ్ లో వారు చాలా దగ్గరగా కనిపించారు. ఈ దృశ్యం చాలా మంది ప్రేక్షకులకు అభ్యంతరకరంగా అనిపించింది.

ఈ ఘటనపై చాలా మంది నెటిజన్లు ట్విట్టర్ లో తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కొందరు ఈ షో నుండి ఆ ఇద్దరు కంటెస్టెంట్లను బహిష్కరించాలని డిమాండ్ చేశారు. బిగ్ బాస్ ఓటీటీ షో ఇప్పటికే అనేక వివాదాలకు కేంద్రంగా నిలిచింది. ఈ ఘటనతో షో కి మరింత చెడ్డ పేరు తెచ్చుకుంది. కాగా శివసేన ఎమ్మెల్యే మనీషా.. ఈ వీడియోపై స్పందిస్తూ.. బిగ్ బాస్ దారుణమైన షో, అంతా అశ్లీలతను చూపిస్తున్నారు. దాన్ని నిషేధించాలని, షో పై ముంబై పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు.

Also Read : ‘డబుల్ ఇస్మార్ట్’ సాంగ్ పై స్పందించిన పూరీ జగన్నాథ్.. ఏమన్నాడంటే?

అసలేం జరిగిందంటే..?

కంటెస్టెంట్ అర్మాన్ మాలిక్, రెండు పెళ్లీలు చేసుకున్నాను అని ఓపెన్‌గా చెప్పడమే కాకుండా, ఆ ఇద్దరితో షోకి కూడా వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఆయన మొదటి భార్య పాయల్ మాలిక్ ఇప్పటికే ఇంటికి వెళ్లగా, రెండో భార్య కృతికా మాలిక్ మాత్రం ఇప్పటికీ హౌస్‌లోనే ఉంది. కాగా, తాజాగా ఈ షోలో అర్మాన్ తన రెండో భార్యతో రాత్రి 12.30 గంటల సమయంలో సెక్స్ లో పాల్గొన్నట్లు ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ బిగ్ బాస్‌ను నిషేదించాలని కామెంట్స్ చేస్తున్నారు.

స్పందించిన జియో సినిమా

" మేము ప్రసారం చేసే కంటెంట్‌ ఏదైనా.. నాణ్యత, మార్గదర్శకాలకు కట్టుబడి ఉంటుంది. జియో సినిమాలో ప్రసారమయ్యే ఓటీటీ బిగ్‌బాస్‌లో అలాంటి అశ్లీల కంటెంట్‌ లేదు. ప్రస్తుతం షేర్‌ అవుతోన్న అశ్లీల వీడియో క్లిప్‌ ఫేక్‌. అది చూసి మాకు కూడా తీవ్ర ఆందోళన కలిగింది. దీని వెనక ఎవరున్నారో త్వరలోనే కనుక్కుంటాం. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం" అని జియో సినిమా ఓ ప్రకటనలో తెలియజేసింది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు